AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నాన్న హీరోలా బైక్‌ నడుపుతుంటే.. వర్షంలో త్రిషాలా ఫోజులిచ్చిన చిన్నారి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తన నాన్న హీరోలా బండి నడుపుతుంటే.. తను మాత్రం పెద్ద హీరోయిన్‌లా ఫోజులిస్తోంది. ఇది చూసిన తోటి వాహనదారులు, ప్రయాణికులు ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్‌ని వీడియో తీసుకుంటున్నారు. అలా తీసిన వీడియోనే ఇది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది.

Watch: నాన్న హీరోలా బైక్‌ నడుపుతుంటే.. వర్షంలో త్రిషాలా ఫోజులిచ్చిన చిన్నారి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Trisha
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2023 | 4:28 PM

Share

వైరల్‌ వీడియో అంటేనే.. అది ఏదో ఒక వింత, విశేషం అని చెప్పకనే తెలిసిపోతుంది. కానీ, కొన్ని వైరల్‌ వీడియోలు మాత్రం మనల్ని కట్టిపడేస్తాయి. మనుసుకు మత్తుగా హత్తుకుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు మరీ ఎక్కువగా నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. పెంపుడు జంతువులు తమ యజమాని ఇంట్లో వాళ్లను అనుకరిస్తూ చేస్తే కొన్ని పనులు ప్రతి ఒక్కరినీ అలరిస్తుంటాయి. వాటితో ఎంత సమయం గడిపినా అలసట అన్నమాటే దరిచేరదు. అలాగే, చిన్నారుల ముద్దు ముద్దు మాటలు. చిట్టి చేతులతో వాళ్లు చేసే పనులు బాగా నచ్చేస్తుంటాయి. చిన్నారులు చేసే అల్లరి కూడా మనకు సందడిగానే అనిపిస్తుంటి. ఇక వాళ్లకు ఆనందం వచ్చిన వేళ వారు చేసే హంగామా చూడాలి.. ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటిదే ఈ వీడియో కూడా..

ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తండ్రి తన బైక్‌పై ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్తున్నాడు.. బైక్‌ నడుపుతున్న నాన్న పెట్టుకోవాల్సిన హెల్మెట్‌.. తన వెనకాల కూర్చున్న చిన్నారి తలకు పట్టాడు.. అది నాన్న ప్రేమనుకోండి.. ఇక ఆ బైక్‌పై నాన్నముందు..నిలబడి ఉన్న బాలుడు హాయిగా నిలబడి ప్రశాంతంగా ప్రయాణిస్తున్నాడు. ఇక వారు ప్రయాణిస్తున్న రోడ్డు కూడా పెద్దగా రద్దీ లేకుండా ఉన్నట్టుగా తెలుస్తోంది. పైగా పై నుంచి సన్నగా ముసురు పడుతోంది. బైక్‌పై వెళ్తున్న వీళ్లను పక్కనే కార్లో వెళ్తున్న కొందరు తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు.. అదే వీడియో ఇప్పుడ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఇంతకీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే..

ఇవి కూడా చదవండి

బైక్‌పై నాన్న వెనకాల కూర్చున్న చిన్నారి తలకు హెల్మెట్‌ పెట్టుకుని ఉంది.. పై నుంచి కురుస్తున్న సన్నని చిరు జల్లులను ఆస్వాదిస్తూ.. ఆ చిన్నారి తన రెండు చేతులను గాల్లోకి చాచింది.. తన నాన్న హీరోలా బండి నడుపుతుంటే.. తను మాత్రం పెద్ద హీరోయిన్‌లా ఫోజులిస్తోంది. ఇది చూసిన తోటి వాహనదారులు, ప్రయాణికులు ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్‌ని వీడియో తీసుకుంటున్నారు. అలా తీసిన వీడియోనే ఇది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను తెగ ఆకట్టుకుంటోంది. కావాలంటే మీరు కూడా మరో మారు వీడియో చూసేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌