Viral Video: కబడ్డి ఆటలో అపశృతి.. కూత పెడుతూ వెళ్లి, అనంత లోకాలకు.. షాకింగ్ వీడియో.

ఇటీవల హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించిన వ్యక్తులు కూడా ఉన్నపలంగా కుప్పకూలి పోతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులోకి రావడంతో ఇలాంటి...

Viral Video: కబడ్డి ఆటలో అపశృతి.. కూత పెడుతూ వెళ్లి, అనంత లోకాలకు.. షాకింగ్ వీడియో.
College Studetn Collapses
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 10, 2023 | 5:46 PM

ఇటీవల హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించిన వ్యక్తులు కూడా ఉన్నపలంగా కుప్పకూలి పోతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులోకి రావడంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లు అవాక్కయ్యేలా చేసింది.

ఓ 20 ఏళ్ల కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వివారల్లోకి వెళితే.. ముంబయికి చెందిన 20 ఏళ్ల క్రితిక్‌ రాజ్‌ అనే కాలేజీ స్టూడెంట్‌ ఇటీవల కళాశాలలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో రాజ్‌ ప్రత్యర్థి కోర్ట్‌లోకి కూతకు వెళ్లాడు. అయితే ప్రత్యర్థి జట్టు విద్యార్థులు క్రితిక్‌ రాజ్‌ను ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో రాజ్‌ ఓటమిని అంగీకరించేశాడు. అయితే తిరిగి తన జట్టు కోర్టులోకి నడుచుకుంటూ వెళ్తోన్న సమయంలో రాజ్‌ ఉన్నపలంగా ఒక్కసారిగా కింద పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

దీంతో తోటి విద్యార్థులు క్రితిక్‌ రాజ్‌ను హుటాహుటిన స్థానికంగా ఉన్న శతాబ్ధి అనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణానికి నిర్ధిష్టమైన కారణం తెలియకపోయినప్పటికీ, గుండెపోటే కారణమని డాక్టర్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మృతుడు క్రితిక్‌ రాజ్‌ ముంబయిలోని సంతోష్‌ నగర్‌లో నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న వివేక్‌ కాలేజ్‌లో బీకామ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..