AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఊరేగింపులో పెళ్లికొడుకును ఎత్తుకుపారిపోయిన గుర్రం..! షాక్‌లో చూస్తుండిపోయిన జనం..!

దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ వీడియోను ఘంటా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వీక్షణలు, లైక్‌లు వచ్చాయి.

Watch: ఊరేగింపులో పెళ్లికొడుకును ఎత్తుకుపారిపోయిన గుర్రం..! షాక్‌లో చూస్తుండిపోయిన జనం..!
Horse Ran Away Carrying The
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2023 | 3:37 PM

Share

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన అనేక రకాల వైరల్‌ వీడియోలు వీక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. పెళ్లితంతులో వధూవరులతో పాటుగా బంధువులు, మిత్రులు చేసే హంగామా, హడావుడి కూడా తరచూ నెట్టింట సందడిగా మారుతుంది. అలాంటిదే ఇక్కడ కూడా ఒక వరుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. పెళ్లి ఊరేగింపుకు నిమిషాల ముందు ఊరేగింపు కోసం తీసుకొచ్చిన గుర్రం వరుడితో కలిసి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. గుర్రం పారిపోతుండగా చూసిన అక్కడి జనమంతా ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు.

ఈ వైరల్ వీడియోలో వరుడు ఊరేగింపుతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి సాంప్రదాయానికి సంబంధి కొన్ని ఆచారాలు మిగిలి ఉన్నాయి. అవి పూర్తి చేయాలి. ఇలోగా వరుడు గుర్రంపై కూర్చొని కనిపిస్తాడు. అకస్మాత్తుగా గుర్రం దగ్గర ఎవరో పటాకులు కాల్చారు. బాణసంచా పేలిన వెంటనే గుర్రం జడుసుకుంది. భయంతో వరుడితో కలిసి అక్కడి నుంచి పరిగెత్తింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

వీడియో చివర్లో, గుర్రం వరుడితో కలిసి పారిపోవడాన్ని చూడవచ్చు. దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ వీడియోను ఘంటా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వీక్షణలు, లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..