Budget 2023: అసెంబ్లీలో గత ఏడాది బడ్జెట్‌ చదివిన ముఖ్యమంత్రి.. పొరపాటును గుర్తించిన తర్వాత ఏం జరిగిందంటే..

రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం గెహ్లాట్ గతేడాది బడ్జెట్‌ను చదవగానే ఒక్కసారిగా నవ్వులు పూశాయి. తాను గత ఏడాది బడ్జెట్ కాపీ తెచ్చుకున్నట్లుగా..

Budget 2023: అసెంబ్లీలో గత ఏడాది బడ్జెట్‌ చదివిన ముఖ్యమంత్రి.. పొరపాటును గుర్తించిన తర్వాత ఏం జరిగిందంటే..
Chief Minister Ashok Gehlot
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 10, 2023 | 4:12 PM

రాజస్థాన్‌ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ జరిగిన బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది. ముందుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ఓ పొరపాటు సొంత పార్టీ వారితోపాటు విపక్ష సభ్యులు కూడా నవ్వుకున్నారు. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టే క్రమంలో గత ఏడాది బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌. 2023-24 బడ్జెట్‌ను చదివే క్రమంలో గత బడ్జెట్‌ను అంటే 2021-22 బడ్జెట్ ప్రతులను సీఎం అశోక్ గెహ్లాట్‌ చదవడం మొదలు పెట్టారు. అయితే, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీఎం పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే అసలు విషయం సీఎం చెవిలో చెప్పారు. మీరు చదువుతున్న కాపీ గత సంవత్సరం బడ్జెట్ ప్రతులు అని తెలిపారు. కాసేపటికి తప్పు తెలుసుకున్న సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నాలుక కరుచుకున్నారు.

తాను ఎంత పొరపాటు చేశానో తెలుసుకుని కొత్త బడ్జెట్‌ను చదివారు. ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్‌ను చదువుతూ ఉండటంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పాత బడ్జెట్‌ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్‌ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్లు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో అసలు సంగతిని ఆయన గుర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టడమే కాదు.. నవ్వులు పూయిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

ఇదే అంశంపై రాజస్థాన్ బీజేపీ విపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదులు చేశారు. బడ్జెట్‌ ముందుగానే కొందరికి ఎలా తెలుస్తుందని ప్రశ్నల వర్షం కురిపంచారు. కొందరికి బడ్జెట్ లీక్ అయ్యిందని స్పీకర్‌ పోడియంను ముట్టడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?