Free Electricity: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలకు పండగేపండగా! ఇకపై ప్రతి నెలా ఉచిత కరెంట్‌..

2023-24 ఆర్ధిక సంవత్సరానికిగానూ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లో సర్కార్ వరాల జల్లు కురిపించింది..

Free Electricity: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలకు పండగేపండగా! ఇకపై ప్రతి నెలా ఉచిత కరెంట్‌..
Free Electricity
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2023 | 3:44 PM

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగానూ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. సీఎం అశోక్ గెహ్లాట్ అధికారంలో ఉండగా ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ స్పీచ్‌లో గృహ వినియోగదారులకు గెహ్లాట్‌ సర్కార్‌ వరాల జల్లు కురిపించింది. ప్రతి నెలా 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు గెహ్లాట్ తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ పరీక్షకు హాజరైనా ఫీజు చెల్లించనవసరం లేదని అన్నారు.

చిరంజీవి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీం కింద ఏడాదికి ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించారు (గతంలో రూ.10 లక్షల వరకు ఉండేది). ఇక పెన్షన్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉచితంగా స్కూటీలు అందించేందుకు ఇస్తున్న రూ.20 వేల మొత్తాన్ని రూ.30 వేలకు పెంచారు. ఇక ఉజ్వలా పథకం కింద ఎల్పీజీ సిలిండర్‌ను కేవలం రూ.500లకే దాదాపు 76 లక్షల కుటుంబాలకు అందిస్తామని అశోక్ గెహ్లాట్ తన ప్రసంగంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.