Child: పేదరికం ముందు ఓడిపోయిన కన్నప్రేమ.. మూడు నెలల చిన్నారిని రోడ్డుపై వదిలేసిన తల్లిదండ్రులు..
తల్లిదండ్రులకు తమ కడుపున పుట్టిన పిల్లలు అంటే ఎంతో ప్రేమ. ఆ చిన్నారులకు తల్లిదండ్రులు అంటే ఎంతో భరోసా. హాయిగా అమ్మ పొత్తిళ్లలో కునుకు తీయాల్సిన వయసులో, నాన్న భుజాలపై హాయిగా ఆడుకోవాల్సిన..
తల్లిదండ్రులకు తమ కడుపున పుట్టిన పిల్లలు అంటే ఎంతో ప్రేమ. ఆ చిన్నారులకు తల్లిదండ్రులు అంటే ఎంతో భరోసా. హాయిగా అమ్మ పొత్తిళ్లలో కునుకు తీయాల్సిన వయసులో, నాన్న భుజాలపై హాయిగా ఆడుకోవాల్సిన సమయంలో రోడ్డు పక్కన అనాథలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రుల పేదరికానికి ఆ చిన్నారి ఒంటరివాడయ్యాడు. శిశువును పెంచేందుకు తమ ఆర్థిక స్థోమత సరిపోదని భావించిన ఆ పేరెంట్.. దారుణంగా ప్రవర్తించారు. కడుపున పుట్టాడన్న కనికరం కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు. గుక్కబట్టి ఏడుస్తున్నా.. కాస్త కూడా మానవత్వం చూపకుండా బిహేవ్ చేశారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.
సూరత్‌లోని గోదాదర ప్రాంతంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కడుప తెంచుకుని పుట్టిన మూడు నెలల చిన్నారిని దంపతులు రోడ్డు పక్కన వదిలేశారు. చిన్నారి ఏడుపు విని అప్రమత్తమైన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్ కు చేరుకుని దగ్గర్లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆ దంపతులపై కేసు నమోదు చేశారు.
బిడ్డను పెంచడానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో తాను ఆ బిడ్డను విడిచిపెట్టానని మహిళ వెల్లడించింది. రోడ్డు పక్కన వదిలేసి వెళితే.. ఎవరైనా దత్తత తీసుకుంటారని, స్వచ్ఛంద సంస్తలు చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటారనే ఉద్దేశంతో తాము ఈ విధంగా చేసినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలపడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..