AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: బీబీసీ బ్యాన్‌కు నో చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..

వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు ఇంత రిలీఫ్ ఎలా అడుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Supreme Court: బీబీసీ బ్యాన్‌కు నో చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
Supreme Court Of India
Sanjay Kasula
|

Updated on: Feb 10, 2023 | 3:13 PM

Share

వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలని సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ రాజకీయ రచ్చ జరిగింది. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ వ్యవహరం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది పింకీ ఆనంద్‌ వాదిస్తూ, బిబిసి ఉద్దేశపూర్వకంగానే ఇమేజ్‌ను కించపరిచిందని వాదించారు. ఇది పూర్తిగా తప్పు అని మీరు దీనిపై ఎలా వాదించగలరని ఈ కేసులో జస్టిస్ ఖన్నా అన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు అలాంటి ఉపశమనం ఎలా అడగగలరు అంటే కోర్టు డాక్యుమెంటరీని నిషేధించగలదా? అంటూ ప్రశ్నించింది.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, ఈ పిటిషన్ తప్పు అని, అటువంటి ఉత్తర్వులను ఎస్సీ ఎలా పాస్ చేస్తుందని కోర్టు పేర్కొంది. డాక్యుమెంటరీలు దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్‌నే దేశంలో సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

అంతకుముందు సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాలని తేల్చి చెప్పింది. ఈ విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

ఇక, గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం