Delhi: ఢిల్లీలో 62 ఏళ్ళ వృద్దురాలిపై లైంగిక దాడి. .. దారుణ హత్య… నిందితుని వివరాలు చెప్పని పోలీసులు..
ఢిల్లీలో 62 ఏళ్ళ వృద్దురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడి జరిపి ఆమెను దారుణంగా హతమార్చాడు. ఆమెను కిరాతకంగా కత్తితో 20 సార్లు పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో 62 ఏళ్ళ వృద్దురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడి జరిపి ఆమెను దారుణంగా హతమార్చాడు. ఆమెను కిరాతకంగా కత్తితో 20 సార్లు పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఆ మహిళ శరీరంపై అనేక చోట్ల గాయాలు ఉన్నాయని వారు చెప్పారు. ఆమెను ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. తానే ఈకిరాతకానికి పాల్పడినట్టు ఇతడు ఇంటరాగేషన్ సందర్బంగా అంగీకరించాడని, నేరానికి వాడిన కత్తిని ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. మద్యం తాగిన మత్తులో ఆమెను చంపానని ఒప్పుకున్నాడని వెల్లడించారు. ఆ వృద్దురాలి గొంతు కోసి ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపామన్నారు. బీహార్ లో బెగుసరాయ్ కి చెందిన ఈ వృద్దురాలు ఢిల్లీ శివార్లలోని గ్రామంలో నివసిస్తోంది.
ఈమెకు కొడుకు, మనవడు ఉన్నాడని, కొడుకు నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడని తెలిసింది. డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆ గార్డు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన తల్లిని దారుణంగా హతమార్చిన దుండగుడిని ఉరి తీయాలని అతడు కోరుతున్నాడు.. కాగా ఈ వృద్దురాలు తన ఇంటి సమీపంలోనే కూరగాయలు అమ్మేదని తెలియవచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ayodhya: యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.400 కోట్లతో అయోధ్యలో బస్‌స్టేషన్
Krack: మరోసారి థియేటర్లలో ఒంగోలు జాతర.. తగ్గేదే లేదంటున్న మాస్ మహారాజా.. బుకింగ్ కూడా షురూ