భారతీయ సిక్కులకు పాక్ శుభవార్త

పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న గురుద్వారాను దర్శించాలనుకునే భారతీయ సిక్కులకు పంజాబ్ ప్రావిన్స్ శుభవార్త తెలిపింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మందిరాన్ని భారతీయ సిక్కులు దర్శించుకునే విధంగా అనుమతినిస్తూ పంజాబ్ గవర్నర్ మహమ్మద్ సర్వర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గురుద్వారాను దర్శించుకునేందుకు పాక్‌తో పాటు యూరప్, కెనడా, అమెరికా నుంచి వచ్చే సిక్కులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ఈ జాబితాలో భారతీయ సిక్కు యాత్రికులు చేరారు. కాగా సిక్కు సంప్రదాయం ప్రకారం […]

భారతీయ సిక్కులకు పాక్ శుభవార్త
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 7:56 AM

పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న గురుద్వారాను దర్శించాలనుకునే భారతీయ సిక్కులకు పంజాబ్ ప్రావిన్స్ శుభవార్త తెలిపింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మందిరాన్ని భారతీయ సిక్కులు దర్శించుకునే విధంగా అనుమతినిస్తూ పంజాబ్ గవర్నర్ మహమ్మద్ సర్వర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గురుద్వారాను దర్శించుకునేందుకు పాక్‌తో పాటు యూరప్, కెనడా, అమెరికా నుంచి వచ్చే సిక్కులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ఈ జాబితాలో భారతీయ సిక్కు యాత్రికులు చేరారు. కాగా సిక్కు సంప్రదాయం ప్రకారం 16వ శతాబ్దంలో గురునానక్ కశ్మీర్ నుంచి సియాల్‌కోట్ చేరుకొని అక్కడ ఒక బేరి చెట్టు కింద సేదతీరారని సిక్కులు విశ్వసిస్తారు. ఆ ప్రదేశంలో సర్దార్ నాథా సింగ్ అనే వ్యక్తి గురునానక్ ఙ్ఞాపకార్థం గురుద్వారా నిర్మించారని చరిత్ర చెబుతోంది.