Assembly Election Results: తమిళనాడులో విజయ్ పార్టీ హవా.. క్షణక్షణం ఉత్కంఠ.. ఆధిక్యంలో ఉన్న నేతలు వీరే..

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతోనే సమీకరణాలు తలకిందులవుతున్నాయి. బెంగాల్‌లో మమతా-బీజేపీ మధ్య యుద్ధం.. తమిళనాట డీఎంకే జైత్రయాత్ర.. కేరళలో పుంజుకున్న యూడీఎఫ్.. అస్సాంలో హవా చూపిస్తున్న బీజేపీ.. ఈవీఎం లెక్కింపులో ఎవరిది పైచేయి అనే విషయాలు తెలుసుకుందాం..

Assembly Election Results: తమిళనాడులో విజయ్ పార్టీ హవా.. క్షణక్షణం ఉత్కంఠ.. ఆధిక్యంలో ఉన్న నేతలు వీరే..
5 State Assembly Election Results 2026 Live

Updated on: May 04, 2026 | 9:21 AM

దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన లెక్కింపులో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ-టీఎంసీ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లీడ్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ-టీఎంసీ మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంది.

తమిళనాట డీఎంకే హవా

తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి  అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే విజయ్ టీవీకే పార్టీ రెండో స్థానంలో కొనసాగుతుండటం విశేషం, ఏఐడీఎంకే 26 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా.. టీవీకే 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  రెండు చోట్ల పోటీ చేసిన సూపర్ స్టార్ విజయ్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెరంబూర్‌‌లో విజయ్ ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు.  చెపాక్ నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మైలాపూర్‌లో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

కేరళలో మారుతున్న సమీకరణాలు..

కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, యూడీఎఫ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ తన పట్టును నిలుపుకుంటోంది. ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం అక్కడ బీజేపీ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ-ఏఐఎన్ఆర్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

లైవ్ వీడియో చూడండి..

Follow Us