AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?

ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని స్పష్టం చేశాయి..త్రివిధ దళాలు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని..సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?
The Indian Armed Forces
Balaraju Goud
|

Updated on: May 11, 2025 | 9:29 PM

Share

పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే.. మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. భారత సైన్యం. ఉగ్ర స్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో.. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమవడంతో పాటు వందమంది ఉగ్రవాదులు అంతమయ్యారని ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన త్రివిధ దళాల అధికారులు.. ఆపరేషన్‌పై కీలక వివరాలను వెల్లడించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 5 , పాకిస్థాన్‌లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వివరించారు. భారత్‌ దాడులు చేస్తుందన్న భయంతో పాక్‌లోని ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయన్నారు.

సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి దాడులు చేసినట్టు చెప్పింది భారత సైన్యం. అందుకు సంబంధించిన మ్యాప్‌లు, ఫోటోలను విడుదల చేసింది. భారత్‌ దాడులతో వణికిపోయిన పాకిస్తాన్‌.. మనదేశంలో పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అయితే శత్రుదేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. మే 8, 9వ తేదీల్లో భారత్‌పై గగనతల దాడికి పాకిస్థాన్‌ విఫలయత్నం చేసింది. డ్రోన్లు, మానవరహిత విమానాలను భారత్‌పై ప్రయోగించింది. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్‌ డ్రోన్‌ దాడులకు కౌంటర్‌గా పాక్‌ రాడార్‌ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు చేసింది భారత్‌. మూడు రోజులపాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్‌ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని సైనిక అధికారులు తెలిపారు. ఇక మే 7 నుండి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశానికి చెందిన 5 మంది సైనికులు అమరులయ్యారని భారత సాయుధ దళాలు తెలిపాయి.

పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్‌ ఎలాంటి దాడులు చేయలేదు. పాకిస్తాన్‌ మాత్రం భారత్ నగరాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. అయితే భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత సైన్యం. దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో ప్రత్యక్ష్యంగా తెలుసుకుంది. పాక్‌ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్‌. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే సరైన సమాధానం చెప్పడానికి.. సైన్యం, వాయుసేనకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సిద్ధంగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్