మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 22 మంది గాయాలపాలయ్యారు. బెంగళూరు-పూణే జాతీయ రహదారిపై పూణే సమీపంలోని నర్హె ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారని.. మరో 22 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిందన్నారు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా.. బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థకు చెందినవారని.. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పూణెకు వెళ్లారని.. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
నర్హే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎన్‌సిపి నాయకురాలు, ఎంపి సుప్రియా సూలే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటన గురించి తెలుసుకున్న సుప్రియా సూలే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అంతకుముందు ఏప్రిల్ 15 న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడిన ఘటనలో 12 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.
#WATCH | Maharashtra: NCP leader and MP Supriya Sule reach the accident site on the Pune–Bengaluru Highway near the Narhe area of Pune city
Four people were killed and 22 others got injured in the accident. All are under treatment. https://t.co/ukAayt5pNS pic.twitter.com/elpR0de2yY
— ANI (@ANI) April 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..