ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు బిందెలో తల ఇరుక్కుపోయిన సీన్లను సినిమాల్లో చూపిస్తుంటారు.. సినిమాలో కామెడి కోసం అలాంటి సీన్లు పండినా, రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి సీన్ ఎదురైతే అంతా టెన్షన్ పడిపోవాల్సిందే.. ఇటీవల కాలంలో చిన్నారులు బిందేలో తలదూర్చి తల్లిదండ్రులను పరుగులు పెట్టించిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందేలో తలదూర్చటంతో తల్లిదండ్రులు, స్థానికులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది.
తమిళనాడులోని విల్లుపురంలో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెలో ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా, బాలుడు బయట ఖాళీ బిందెతో ఆడుకుంటున్నాడు. అంతలోనే పొరపాటున అందులో ఇరుక్కున్నాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి, మొత్తం శరీరం బిందెలో ఇరుక్కుపోయింది. బాలుడి తల్లిదండ్రులు అతడిని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా బాలుడిని బయటకు తీయలేకపోయారు. దాంతో బాలుడిని తిరునెన్నై నల్లూర్ అగ్నిమాపక శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది..గంటసేపు కష్టపడి కటర్లను ఉపయోగించి బిందెను కత్తిరించారు. అనంతరం బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. ఆ తర్వాత అతనికి ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..