సైకిల్‌ను తప్పించబోయి డ్రైనేజీలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు
ప్రమాద వార్త అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసు బృందం చేరుకుంది. హుటాహుటిన సాహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంత ప్రజల సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు అందులో దాదాపు 53 మంది ప్రయాణిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలో ఓ బస్సు డ్రైనేజీలో పడింది. ఓ సైక్లిస్ట్‌ను తప్పించబోయి.. బస్సు అదుపు తప్పి డ్రైనేజీలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. బల్‌రాంపూర్ నుంచి సిద్ధార్ధనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 53 మంది ఉన్నారు. సైక్లిస్ట్‌ను రక్షించే క్రమంలో బస్సు అదుపు తప్పి డ్రైనేజీలో పడినట్లు ఎస్పీ ప్రాచీ సింగ్ తెలిపారు. ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆ సైకిల్ తొక్కే వ్యక్తి కూడా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బల్‌రామ్‌పూర్ నుంచి సిద్ధార్థనగర్‌కు వెళ్తున్న బస్సు చార్గహ్వా డ్రెయిన్‌లో పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రమాదం ధేబరువ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసు బృందం చేరుకుంది. హుటాహుటిన సాహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంత ప్రజల సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు అందులో దాదాపు 53 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో మైనర్‌తో సహా ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు.
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని రక్షించేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించగా, బస్సు ప్రమాదానికి గురైందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారిలో సైక్లిస్ట్ మాగాణి రామ్, బస్సు ప్రయాణికులు అజయ్ వర్మ, గామాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది గాయపడ్డారు. వారందరినీ సిద్ధార్థనగర్‌లోని సిఎస్‌సి బద్దాని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..