Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్‌ ప్రాణాన్ని బలి తీసుకున్న వరకట్నం.. సంబంధాన్ని క్యాన్సిల్‌ చేసుకోవడంతో..

అయితే ఇదే సమయంలో పెళ్లి కొడుకు తరఫున వారు భారీగా కట్నం డిమాండ్‌ చేశారు. వరకట్నంలో భాగంగా బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో వరకట్నం అడిగారు. దీంతో అంత కట్నం ఇచ్చుకోలేమని షహానా కుటుంబం చెప్పింది. అడిగినంత కట్నం ఇవ్వని కారణంతో పెళ్లికొడుకు తరపున వారు వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన షహానా.. అపార్ట్‌మెంట్‌లో మంగళవారం...

డాక్టర్‌ ప్రాణాన్ని బలి తీసుకున్న వరకట్నం.. సంబంధాన్ని క్యాన్సిల్‌ చేసుకోవడంతో..
Kerala Doctor
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 07, 2023 | 12:56 PM

కేరళలో దారుణ సంఘటన జరిగింది. వివాహం రద్దు అయిందన్న కారణంతో 26 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షహానా (26) అనే 26 ఏళ్ల యువతి కేరళలోని తిరువనంతపురం మెడికల్‌ కాలేజీలో పీజీ చదువుతోంది. ఈ క్రమంలోనే షహానా, తన క్లాస్‌మేట్‌తో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే ఇదే సమయంలో పెళ్లి కొడుకు తరఫున వారు భారీగా కట్నం డిమాండ్‌ చేశారు. వరకట్నంలో భాగంగా బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో వరకట్నం అడిగారు. దీంతో అంత కట్నం ఇచ్చుకోలేమని షహానా కుటుంబం చెప్పింది. అడిగినంత కట్నం ఇవ్వని కారణంతో పెళ్లికొడుకు తరపున వారు వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన షహానా.. అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. “అందరికీ డబ్బే కావాలి” అంటూ ఓ సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. షహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ విచారణకు ఆదేశించారు. సరైన విచారణ జరిపి నివేదికను సమర్పించాలని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. కేరళ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ అడ్వకేట్ సతీదేవి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి నివేదిక కోరారు. స

అధిక కట్నం డిమాండ్‌ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హామి ఇచ్చారు. ఇక వరకట్న వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని.. మెడికల్‌ పీజీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ బాధ్యతల నుంచి తొలగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..