‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. సేవా ముసుగులో ఏం చేస్తున్నారు..?

మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 డెడ్ బాడీలు.. మరో 13 మంది మానసిక వికలాంగులకు ట్రస్ట్ నుంచి విముక్తి అంతేకాదు ఇక్కడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లేదా డిఫరెంట్లీ-ఏబుల్డ్ పర్సన్స్ కమీషనరేట్ నుండి మేధో వైకల్యాలు లేదా మానసిక అనారోగ్యాలు ఉన్న వ్యక్తులకు వసతి కల్పించడానికి ట్రస్ట్‌కు అవసరమైన అనుమతులు కూడా లేవు. మొత్తానికి 'లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్' లో బయటపడ్డ షాకింగ్ ఘటనలతో స్వచ్ఛంద సంస్థల నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి.

'లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్' తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. సేవా ముసుగులో ఏం చేస్తున్నారు..?
Tamil Nadu Police(Representative image)
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 11, 2024 | 8:55 PM

అనుమానాస్పదం. అంతా అనుమానాస్పదం.. పేరుకి అది మానసిక వికలాంగుల కేంద్రం. కానీ లోపల జరుగుతోంది మాత్రం మొత్తం అనుమానాస్పదమే.. తమిళనాడు నీలగిరి కొండల్లో ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ నిజంగా మానసిక వికలాంగుల కేంద్రమేనా? లేక ఆ పేరుతో అక్కడ మానవ అవయవాల అక్రమ వ్యాపారం జరుగుతోందా? లేక మానసిక వికలాంగులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారా? ఎందుకు ఇన్ని అనుమానాలు అంటారా? మానసిక వికలాంగుల ఆశ్రమంగా చెబుతున్న ఆ ఆశ్రమంలో పరిస్థితులు అలానే ఉన్నాయి. అంతే కాదు ఆ ఆశ్రమంలో బయటపడ్డ 20 మృతదేహాలతో పాటు, అక్కడ దీనాస్థలో ఉన్న 13 మంది మానసిక వికలాంగులను చూస్తే ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో పోలీసులు జరిపిన దాడిలో అనూహ్య విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో ఆశ్రమ ప్రాంగణంలో పూడ్చిపెట్టిన 20 మృతదేహాలు బయటపడ్డాయి. ఇవి ఎవరివనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆశ్రమంలో బందీలుగా ఉన్న 13 మంది మానసిక వికలాంగులకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. రెండు రోజులుగా పోలీసులు ఈ ఆశ్రమంలో విచారణ జరుపుతున్నారు.

1999 నుంచి నీలగిరి కొండల్లో ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ ఉంది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే దీనికి ఎటువంటి అనుమతులు లేకుండా అగస్టీన్ అనే వ్యక్తి 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. గత వారం నీలగిరి జిల్లా అధికారులకు ట్రస్ట్‌లో అమానవీయ స్థితిలో మానసిక వికలాంగులు ఉన్నారని ఫిర్యాదు అందింది. దీంతో గుడలూరు పోలీసులు 8 జూలైన ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ ను పరిశీలించారు. ట్రస్ట్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారని గుర్తించారు. అంతే కాదు అక్కడ మానసిక వికలాంగులు కనీస సౌకర్యాలు లేని దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని వారు గుర్తించారు. మరింత ఆందోళనకర విషయం ఏంటంటే.. 20 మందికి పైగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా ఆశ్రమంలోనే పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఆశ్రమంలో అక్రమంగా 20 మంది మృత దేహాలను పూడ్చడం పై స్థానిక గ్రామ పరిపాలనా అధికారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల్లో 20 మంది ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుల శరీర భాగాలను విక్రయించే ప్రయత్నాలపై కూడా అనుమానాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ తదుపరి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు మానసిక వికలాంగులపై క్లినికల్ ట్రయల్స్‌ చేస్తున్నారా? అనే కోణంలోనూ తమిళనాడు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

కాలికట్‌కు చెందిన అగస్టిన్ ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అగస్టిన్‌తో పాటు ఆయన కుటుంబం ఆశ్రమానికి సమీపంలోని ఇంటిలోనే నివసించారు. అయితే, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు, అగస్టిన్ సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు. తమిళనాడు రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని మూసివేశారు. ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ సంస్థ స్వచ్ఛంద ట్రస్ట్‌గా నమోదు చేయబడినప్పటికీ, కావాల్సిన అనుమతులు కానీ సౌకర్యాలు కానీ ఇక్కడ లేవు. అంతేకాదు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లేదా డిఫరెంట్లీ-ఏబుల్డ్ పర్సన్స్ కమీషనరేట్ నుండి మేధో వైకల్యాలు లేదా మానసిక అనారోగ్యాలు ఉన్న వ్యక్తులకు వసతి కల్పించడానికి ట్రస్ట్‌కు అవసరమైన అనుమతులు కూడా లేవు. మొత్తానికి ‘లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ లో బయటపడ్డ షాకింగ్ ఘటనలతో స్వచ్ఛంద సంస్థల నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..