మరోసారి తల్లి కానున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్!

22 December 2024

Basha Shek

టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ  ముద్దుగుమ్మది ప్రత్యేక స్థానం. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.

అయితే సినిమా  కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఓ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఓ బిడ్డకు తల్లెంది.

ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి అమ్మ గా ప్రమోషన్ పొందనుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది

ఆ క్రేజీ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిందీ అందాల తార.

దీంతో కాజల్ అగర్వాల్ రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉందని సమాచారం.

అయితే ప్రెగ్నెన్సీపై కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.

కాగా హీరోయిన్ గా తన సినిమా కెరీర్ పీక్స్‌లో సమయంలోనే చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్.

ఆ తర్వాత ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది కాజల్. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందీ అందాల తార