ఇద్దరు డిప్యూటీ సీఎంలతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్

22 December 2024

Basha Shek

చాలామంది  స్టార్ హీరోయిన్లలాగే ఈ క్యూటీ కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 

తల్లిదండ్రులిద్దరిది సినిమా నేపథ్యం కావడంతో హీరోయిన్ గా అవకాశం కూడా చాలా త్వరగానే వచ్చిందీ ఈ అందాల తారకు.

మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

ఆమె మరెవరో కాదు మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అందుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న  ఈ బ్యూటీ రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని గోవాలో పెళ్లి చేసుకుంది.

 కాగా బ్యూటీ ఇద్దరు డిప్యూటీ సీఎంలతో యాక్ట్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి సినిమాలో నటించింది.

ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ తో కలిసి మామన్నమ్ సినిమా చేసింది. అయితే ఈ రెండూ పెద్దగా ఆడలేదు.

ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తోంది కీర్తి సురేశ్. ఇది ఆమెకు మొదటి బాలీవుడ్ సినిమా.