మీరు అమరులై రెండేళ్లు పూర్తి.. మీ త్యాగాన్ని దేశం మరచిపోదు.. పుల్వామా అమరవీరులకు కన్నీటి నివాళులర్పిస్తున్న దేశం

ప్రపంచ దేశాలకు ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు గుర్తుకొస్తే.. కానీ భారత దేశానికి మాత్రం పుల్వామా ఘటన గుర్తుకొస్తుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో భారత్ జవాన్లు పయనిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు..

మీరు అమరులై రెండేళ్లు పూర్తి.. మీ త్యాగాన్ని దేశం మరచిపోదు.. పుల్వామా అమరవీరులకు కన్నీటి నివాళులర్పిస్తున్న దేశం
Surya Kala

|

Feb 14, 2021 | 4:15 PM

2 Years of Pulwama Terror Attack: ప్రపంచ దేశాలకు ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు గుర్తుకొస్తే.. కానీ భారత దేశానికి మాత్రం పుల్వామా ఘటన గుర్తుకొస్తుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో భారత్ జవాన్లు పయనిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి ఈరోజుకి భారతీయుల కళ్ళకు కనిపిస్తూనే ఉంది. ఆరోజున ఉగ్రవాదులు సృషించిన విధ్వసం మదిని వీడకుంది. పుల్వామా ఉగ్రదాడిని దేశం మరోసారి గుర్తు చేసుకుంది. దేశ రక్షణ, భద్రతలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తోంది.

అయితే పుల్వామా ఎటాక్ జరిగి రెండేళ్ళైన సందర్భంగా ఈరోజు ఆఘటనను గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. పుల్వామా ఘటనను దేశం యావతు ముక్తకంఠంతో ఖండించింది. పుల్వామా ఘటనతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, భారత సైనికులు అమర సైనికులకు నివాళులర్పించారు.

సరిగ్గా 2019 ఫిబ్రవరి 14తేదీన 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను జైషే ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌కు వెళుతున్న సిఆర్‌పిఎఫ్‌ కాన్వారులపై అవంతిపుర సమీపంలో జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ ఆత్మాహుతి దాడి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో దేశం వీరిని స్మరించుకుంటుంది.

పుల్వామా దాడితో దేశం మొత్తం షాక్ గురయ్యాయింది. ఉగ్రవాదుల చర్యలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం .. మనదేశ భద్రతాదళాలు నిర్ణయం తీసుకుని..బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని, చెట్లు, ఖాళీ ప్రదేశాల్లో బాంబుదాడులు చేశారని పాక్ బుకాయించినా, ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతమైనట్టుగా ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది.

ఇటీవల పాకిస్థాన్ కు చెందిన ప్రధాన వ్యక్తి.. బాలాకోట్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ను ఒప్పుకుంటూ.. దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నామని అక్క్కడ మీడియాతో చెప్పాడు కూడా..

Also Read:

ఒకప్పుడు బాగా బతికిన రైతు.. భార్య మరణం.. కరిగిన ఆస్తులు.. ఆదరించని బంధువులు.. వృద్ధుడి దీనగాథ

బెంబేలెత్తించిన భారత్ బౌలర్లు.. కుప్పకూలిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెట్.. ఆధిక్యంలో భారత్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu