ఒకప్పుడు బాగా బతికిన రైతు.. భార్య మరణం.. కరిగిన ఆస్తులు.. ఆదరించని బంధువులు.. వృద్ధుడి దీనగాథ
ఆస్తి, ఐశ్వర్యం ఉన్నంతకాలం చుట్టాలు బంధు మిత్రులతో కళకళలాడింది ఆ కుటుంబం. గడుస్తున్న కాలంతో పాటు అతనికి తోడునీడగా నిలవాల్సిన భార్య దూరమయ్యింది. ఇక బంధువులు చేరదీయకపోవడంతో ఎవరూ లేని అనాథగా మిగిలిపోయి బతుకు పోరాటం సాగిస్తున్నాడు...
Old Man on The Footpath : ఆస్తి, ఐశ్వర్యం ఉన్నంతకాలం చుట్టాలు బంధు మిత్రులతో కళకళలాడింది ఆ కుటుంబం. గడుస్తున్న కాలంతో పాటు అతనికి తోడునీడగా నిలవాల్సిన భార్య దూరమయ్యింది. ఇక బంధువులు చేరదీయకపోవడంతో ఎవరూ లేని అనాథగా మిగిలిపోయి బతుకు పోరాటం సాగిస్తున్నాడు…చేరదీసే… దిక్కులేక.. నిలువ నీడ లేక స్మారక స్థూపాన్ని తన ఇళ్లుగా కాలం వెళ్లదీస్తున్నాడు ఖమ్మంలోని ఓ వృద్ధుడు.. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం, జిల్లా ఏన్కూరు మండలం ఆరికాయలపాడుకు చెందిన మేడిది వీరారెడ్డి సన్నకారు రైతు…ఆ ఊరిలో వ్యవసాయం ఆధారంగా… జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబ. కానీ, ఆ కుటుంబంలో భార్య చనిపోవడం…దానికి తోడు సంతానం లేకపోవడంతో వీరారెడ్డి ఒక్కడే అనాథగా మిగిలారు. కాలక్రమంలో ఉన్న ఆస్తులు కరిగిపోయి.. నిలువ నీడ లేక గ్రామ కూడలిలోని ఓ పార్టీ స్తూపం దిమ్మె కింద మంచం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు.
గతంలో ఉన్న ఇంటి స్థలం అమ్మేశాడు… వచ్చిన నగదుతో ఎక్కడైనా రేకులతో ఆవాసం ఏర్పాటు చేసుకుందామనుకున్నాడు..కానీ, గుర్తు తెలియని వ్యక్తులు నగదును చోరీ చేశారని వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని పశువైద్యశాలలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని కూడలిలో ఇలా పార్టీ నాయకుడి స్తూపం పిల్లర్ల మధ్య నివాసముంటూ..భిక్షాటన చేసుకుంటూ… కడుపు నింపుకొంటున్నారు. ఆసరా పింఛనుతో మందులు, ఇతర అవసరాలు తీర్చుకొంటున్నారు. ఈ వృద్ధుడు దీన స్థితిని చూసిన ఓ ఫౌండేషన్ నిర్వాహకుడు ఖమ్మంలోని ఆశ్రమానికి తరలించారు. దీంతో వీరారెడ్డి విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.
Also Read: