Highway: హైవేపై కదులుతున్న బస్సులో మంటలు.. బస్సు దగ్ధం, ఇద్దరు మృతి.. 12మందికి గాయాలు

|

Nov 09, 2023 | 9:07 AM

బుధవారం రాత్రి ప్రైవేట్ స్లీపర్ బస్సు ఢిల్లీ-జైపూర్ హైవే మీద వెళుతోంది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులకు ఏమి జరిగిందో అర్ధం చేసుకునే లోపునే మంటలు బస్సుని మొత్తం ఆక్రమించాయి. బస్సు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదం జరిగిన  సమయంలో కొందరు ప్రయాణికులు బస్సు ద్వారం నుంచి బయటకు రాగా.. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు.

Highway: హైవేపై కదులుతున్న బస్సులో మంటలు.. బస్సు దగ్ధం, ఇద్దరు మృతి.. 12మందికి గాయాలు
Bus Fire
Follow us on

ఢిల్లీ – జైపూర్ హైవేపై బుధవారం రాత్రి పెను ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కాగా 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణీకులను మేదాంత, సివిల్ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సనందిస్తున్నారు. అక్కడ నుండి కొందరిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అయితే గాయపడిన ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సమాచారం ప్రకారం బుధవారం రాత్రి ప్రైవేట్ స్లీపర్ బస్సు ఢిల్లీ-జైపూర్ హైవే మీద వెళుతోంది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులకు ఏమి జరిగిందో అర్ధం చేసుకునే లోపునే మంటలు బస్సుని మొత్తం ఆక్రమించాయి. బస్సు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదం జరిగిన  సమయంలో కొందరు ప్రయాణికులు బస్సు ద్వారం నుంచి బయటకు రాగా.. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. అయితే కొంత మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. హైవే మీద జరిగిన ఈ ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ప్రజలు చూసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

బస్సులో ఇద్దరు ప్రయాణికుల మృతదేహాలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపు చేసి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. దాదాపు 12 మంది ప్రయాణికులు కాలిపోగా..  పోలీసు బృందం వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బస్సు లోపల తనిఖీ చేయగా ఇద్దరు ప్రయాణికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రయాణికుల మృతదేహాలు కాలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

క్షతగాత్రులకు చికిత్స

గాయపడిన ప్రయాణీకులను మేదాంత, సివిల్ ఆసుపత్రికి తరలించింది పోలీసు బృందం. అయితే క్షతగాత్రుల్లో కొందరిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో మంటల్లో కాలిపోయిన ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రైవేట్ బస్సు ఏ కంపెనీకి చెందినదో తెలియాల్సి ఉంది.

స్లీపర్ బస్సులో మంటలు చెలరేగిన వీడియో కూడా బయటపడింది.. అందులో బస్సు హైవేపై కాలిపోతున్నట్లు కనిపిస్తుంది. మంటలు ఎగిసిపడుతుండడంతో వాహనాల్లో వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..