AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: రాక్షసుల్లా మారిన తోబుట్టువులు.. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..

Viral Video: వేరే కులం యువకుడిని ప్రేమించిందనే కారణంతో తోడ పుట్టిన చెల్లిని చావ బాదారు. నలుగురు అన్నలు తన చెల్లిని చెట్టుకు వేలాడదీసి గొడ్డును..

Crime News: రాక్షసుల్లా మారిన తోబుట్టువులు.. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..
Girl Harassed
Shiva Prajapati
|

Updated on: Jul 03, 2021 | 12:48 PM

Share

Crime News: వేరే కులం యువకుడిని ప్రేమించిందనే కారణంతో తోడ పుట్టిన చెల్లిని చావ బాదారు. నలుగురు అన్నలు తన చెల్లిని చెట్టుకు వేలాడదీసి గొడ్డును కొట్టినట్లు కొట్టారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలిరాజాపూర్ జిల్లా ఫుట్టాలాబ్ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫుట్టాలాబ్ గ్రామానికి చెందిన యువతి.. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అది తెలిసిన యువతి తండ్రి, నలుగురు అన్నలు.. ఆమెను తాళ్లతో కట్టి చెట్టుకు వేలాడదీశారు. ఆ తరువాత కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఊరి జనం అందరూ చూస్తుండగానే అత్యంత క్రూరంగా ఆ యువతిని హింసించారు. తనను వదిలి పెట్టమని ఎంతగా వేసుకున్నా వారు ఏమాత్రం కనికరించలేదు. గొడ్డును బానిట్లు బాదారు.

అయితే, యువతిని సొంత కుటుంబ సభ్యులే కొట్టడాన్ని కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌ అయ్యింది. చివరికి అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కంట పడటంతో ఆయన దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని చిత్రహింసలకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సొంత చెల్లినే గొడ్డును బాదినట్లు బాదిన నలుగురు అన్నలను, యువతి తండ్రిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.

Also read:

Dehradun Man: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఓ వ్యక్తి.. 100 మందికి దత్తత తీసుకునేందుకు ముందుకు ఎక్కడంటే

Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

Brahma kamalam: కోనసీమలో వికసించిన బ్రహ్మ కమలం.. అరుదైన పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న జనాలు..