Corona Cases: దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు.. వైరస్‌తో 15 మంది మృతి..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 12,899 మంది వైరస్​ బారినపడగా.. మరో 15 మంది కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు. కొత్తగా 8,518 మంది కోరనా నుంచి కోలుకున్నారు...

Corona Cases: దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు.. వైరస్‌తో 15 మంది మృతి..
Coronavirus
Follow us

|

Updated on: Jun 19, 2022 | 11:02 AM

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 12,899 మంది వైరస్​ బారినపడగా.. మరో 15 మంది కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు. కొత్తగా 8,518 మంది కోరనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.63 శాతానికి చేరింది. ఇక మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 4,32,96,692 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఇప్పటివరకు 5,24,855 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 72,474గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,99,363గా ఉంది. ఇక టీకాల విషయానికొస్తే శనివారం 13,24,591 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,14,88,807 కోట్లకు చేరింది. మరో 4,46,387 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3,64,517 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 721 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 543,984,866కు చేరింది. మరణాల సంఖ్య 63,40,108కు చేరింది. ఒక్కరోజే 3,84,816 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 51,91,06,781గా ఉంది. అమెరికాలో 12,749 కేసులు వెలుగుచూశాయి. 24 మందికిపైగా చనిపోయారు. ఇటలీ ఒక్కరోజే 34,971 మంది కొవిడ్​ బారినపడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో 80,019 కేసులు బయటపడ్డాయి.