Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. భారీ ఎన్‌కౌంటర్.. 12మంది మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, ఎస్‌టీఎఫ్ బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడ్డ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

కాల్పుల మోతతో మరోసారి దండకారణ్యం దద్దరిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం(ఫిబ్రవరి 9) ఉదయం నుండి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ -నారాయణపూర్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, ఎస్‌టీఎఫ్ బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది భద్రతా దళాలు గాయపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, దీని గురించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, 4 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను సంఘటన స్థలం నుండి తరలించడానికి జగదల్‌పూర్ నుండి MI 17 హెలికాప్టర్‌ను పంపించారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. . బస్తర్ రేంజ్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
కొత్త ఏడాదిలో మావోయిస్టుల ఏరివేత చురుగ్గా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. జనవరి 5న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్, అదే నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇక జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు చనిపోయారు. జనవరి 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 16మంది నక్సల్స్ హతమయ్యారు. జనవరి 29న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మరికొందరు మావోయిస్టులు చనిపోయారు. ఫిబ్రవరి 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు ప్రాణాలు వదిలారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌తో కలిపి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 60మంది మావోయిస్టులు హతమయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..