Odisha: ఒడిషాలో కొనసాగుతున్న పిడుగుల వర్షం.. 2 మంది మృత్యువాత

వర్షాకాలంలో పిడుగులు పడటం సహజం.. కానీ పిడుగుల వర్షం అంటుంటామే అదే ఇప్పుడు ఒడిషాలో జరిగింది. రెండురోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తూనే ఉందక్కడ. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2 గంటల్లో 61 వేల పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాందంలో మొత్తం 12 మంది చనిపోవడం కలకలం రేపింది.14 మందికి గాయపడ్డారు. అయితే మృతుల్లో ఎక్కువమంది ఖుర్దా, బాలాంగిర్ జిల్లాలకు చెందినవారు. అయితే ఈ పిడుగుపాటు ఇక్కడితోనే ఆగబోదని, పిడుగుల వాన మళ్లీమళ్లీ కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఐఎమ్‌డి.

Odisha: ఒడిషాలో కొనసాగుతున్న పిడుగుల వర్షం.. 2 మంది మృత్యువాత
Thunderstorm

Updated on: Sep 04, 2023 | 10:19 PM

వర్షాకాలంలో పిడుగులు పడటం సహజం.. కానీ పిడుగుల వర్షం అంటుంటామే అదే ఇప్పుడు ఒడిషాలో జరిగింది. రెండురోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తూనే ఉందక్కడ. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2 గంటల్లో 61 వేల పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాందంలో మొత్తం 12 మంది చనిపోవడం కలకలం రేపింది.14 మందికి గాయపడ్డారు. అయితే మృతుల్లో ఎక్కువమంది ఖుర్దా, బాలాంగిర్ జిల్లాలకు చెందినవారు. అయితే ఈ పిడుగుపాటు ఇక్కడితోనే ఆగబోదని, పిడుగుల వాన మళ్లీమళ్లీ కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఐఎమ్‌డి. ఈనెల ఏడవ తేదీ వరకు వానలతో తీవ్రపరిణామాలుంటాయని ఒడిషా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బైటికి వెళ్లొద్దని, పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు సమీపంలోని భవనాలకు చేరుకోవాలని, చెట్లకు, చెరువులకు దూరంగా ఉండాలని సూచించింది ఒడిషా ప్రభుత్వం.

గతంలో నమోదైన అత్యంత ఘోరమైన పిడుగుపాట్లు వేలాదిమందిని బలితీసుకున్నాయి. 1769లో ఇటలీలో పేలుడు పదార్థం నిల్వ ఉన్న ప్రాంతంలో పిడుగు పడి 3000 మంది మరణించారు. ఫిలడెల్ఫియాలో ఎగురుతున్న విమానంపై పిడుగు పడి 81 మంది ప్రయాణికులు చనిపోయారు. 1994లో ఈజిప్ట్‌ ఆర్మీకి చెందిన ఇంధన ట్యాంకులపై పిడుగుపడి 469 మంది మరణించారు. లైట్నింగ్ రెసిలెంట్ ఇండియా క్యాంపెయిన్ నివేదిక ప్రకారం పిడుగులు పడ్డంలో మధ్యప్రదేశ్‌ది మొదటిస్థానం. ఆ తర్వాతి ప్లేస్‌లో ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇప్పుడు ఒడిషాలో ఏకంగా 61 వేల పిడుగులు పడ్డం ఒక పెనువిషాదం. బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు జనం.మరో విషయం ఏంటంటే ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పనుల నిమిత్తం పోలాల్లోకి వెళ్లే రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా పిడుగు పాటుకు గురై ప్రతిఏడాది చాలా మంది మృతి చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో పనిచేసే రైతులు ఈ పిడుగుపాట్లకు ఎక్కువగా బలైపోతున్నారు. వర్షాలు వచ్చే సూచనలు కనిపిస్తే ఇంటికి వెళ్లిపోవడమే మంచిదని నిపుణలు చెబుతున్నారు. ఎందుకంటే చెట్ల కింద ఉండటం వల్ల పిడుగుపాటుకు బలయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒడిషాలో పిడుగు పాటుకు గురై 12 మంది మృతి చెందడం చర్చనీయాంశమవుతోంది.  అయితే పిడుగులు ఎక్కడైన.. ఏ క్షణమైన రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచినస్తున్నారు.