Mahesh Babu: మాటిచ్చిన మహేష్.. పరశురామ్‌కు ఏం సూచించారంటే..!
'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్నారన్న వార్త ఇటీవల ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని తెలుస్తోంది.

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్నారన్న వార్త ఇటీవల ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని తెలుస్తోంది. అయితే మహేష్‌కు కథ చెప్పకముందు పరశురామ్, నాగ చైతన్యతో ఓ సినిమాను ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించబోతున్న ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ మహేష్ కథకు ఓకే చెప్పాక.. పరశురామ్- నాగ చైతన్య కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంలో మహేష్ బాబు, పరశురామ్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కచ్చితంగా ఈ సినిమా చేస్తానని మాటిచ్చిన మహేష్.. తొలుత నాగ చైతన్య సినిమాను పూర్తి చేయాలని సూచించారట. ఆ మూవీ విడుదల అయ్యాకే మనం సెట్స్ మీదకు వెళ్దామని పరశురామ్‌కు సూపర్‌స్టార్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో చైతూ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ప్లాన్‌లో పరశురామ్ ఉన్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మెగాస్టార్‌తో కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాలో అతిథి పాత్రలో మహేష్ మెరవనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌తో దాదాపు 30 నిమిషాల పాటు సూపర్‌స్టార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్లు కూడా ఇచ్చేసినట్లు టాక్.