Anasuya: అనసూయ పేరును కూడా అనుకోలేదట..!
బుల్లితెరపైన తన యాంకరింగ్‌తో దూసుకుపోతోన్న హాట్ యాంకర్ అనసూయకు మరో బంపరాఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు గుప్పుమంటున్నాయి. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ అందాదూన్‌ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. అందులో ఓ కీలక పాత్ర కోసం

బుల్లితెరపైన తన యాంకరింగ్‌తో దూసుకుపోతోన్న హాట్ యాంకర్ అనసూయకు మరో బంపరాఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు గుప్పుమంటున్నాయి. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ అందాదూన్‌ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. అందులో ఓ కీలక పాత్ర కోసం అనూయను అనుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మాతృకలో టబు నటించిన విలన్ పాత్రను తెలుగులో అనసూయ చేయబోతున్నట్లు టాక్ నడిచింది. ఈ రీమేక్‌లో నటించేందుకు టబు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. ఆమె స్థానంలో అనసూయను సంప్రదించారని, ఇక ఇందులో నటించేందుకు ఈ హాట్ యాంకర్ ఓకే చెప్పిందని గాసిప్‌లు వినిపించాయి. ఇదివరకు క్షణం మూవీలో అనసూయ విలన్ పాత్రలో నటించగా.. మరోసారి అదే పాత్రలో మెరవనుందని పుకారు షికారు చేసింది.
అయితే మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ రీమేక్ కోసం అనసూయను సంప్రదించలేదట. హిందీలో నటించిన టబునే ఇందులో కూడా నటింపజేయాలని దర్శకుడు భావించారట. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరపడం.. తన పాత్రలో మరోసారి నటించేందుకు టబు ఆసక్తిని చూపడం రెండూ జరిగిపోయాయని టాక్. వారి సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం అనసూయ పేరును కూడా అనుకోలేదని తెలుస్తోంది. టబు పాత్ర కోసం ముందు నుంచే ఆమెనే అనుకున్నారని, మిగిలిన ఎవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేదని సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.