Rock Salt Benefits: కళ్లు ఉప్పు గురించి మీకు తెలియని రహస్యాలు ఇవే..

ఉప్పు అనేది శరీరానికి ఎంతో అవసరం. కాని మితి మీరి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలి. ఉప్పు వల్ల అనారోగ్య సమస్యలే కాదు. ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. సరిగ్గా వాడితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉప్పు ఉపయోగం వల్ల మెదడు అనేది యాక్టీవ్‌గా పని చేస్తుంది. కానీ సాల్ట్ కంటే కళ్లు ఉప్పు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా..

Rock Salt Benefits: కళ్లు ఉప్పు గురించి మీకు తెలియని రహస్యాలు ఇవే..
Rock Salt

Updated on: Feb 07, 2024 | 1:22 PM

ఉప్పు అనేది శరీరానికి ఎంతో అవసరం. కాని మితి మీరి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలి. ఉప్పు వల్ల అనారోగ్య సమస్యలే కాదు. ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. సరిగ్గా వాడితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉప్పు ఉపయోగం వల్ల మెదడు అనేది యాక్టీవ్‌గా పని చేస్తుంది. కానీ సాల్ట్ కంటే కళ్లు ఉప్పు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా.. హెల్దీగా ఉండొచ్చు. కళ్లు ఉప్పును ఆయుర్వేదంలో కూడా పలు సమస్యల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. మరి ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఉప్పు గురించి మీకు తెలియని నిజాలు:

– నిద్రలేమి సమస్యలను తొలగించడంలో కళ్లు ఉప్పు ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టేలా చేస్తుంది.

– స్నానం చేసేటప్పుడు నీటిలో కళ్లు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు అనేవి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

– జుట్టు రాలే సమస్యతో బాధ పడేవారు షాంపూలో కొద్దిగా కళ్లు ఉప్పు వేసుకుని.. తల స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

– చిగుళ్ల సమస్యతో బాధ పడేవారు కళ్లు ఉప్పుతో పళ్లు తోముకోవడం వల్ల.. చిగుళ్లు దృఢంగా మారడంలో సహాయ పడుతుంది.

– కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కూడా కళ్లు ఉప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

– గొంతే నొప్పితో ఇబ్బంది పడేవారు గోరు వెచ్చటి నీటిలో కళ్లు ఉప్పు వేసి.. తాగినా లేదా పుక్కిలించాలి. దీని వల్ల గొంతు దగ్గర ఉన్న ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది. మంచి రిలీఫ్ దొరుకుతుంది.

– ఉప్పు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మెరుగు పడుతుంది. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, మల బద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

– శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది.

– అజీర్తితో బాధ పడేవారు భోజనం తర్వాత మజ్జిగలో కళ్లు ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఉపశమనం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.