Indian Railways: రైలులో మీ లగేజ్ దొంగలించారా? రైల్వేశాఖ మీకు నష్టపరిహారం ఇస్తుందని తెలుసా?
మనం పోయిన లగేజీకు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్ట ప్రకారం పొగొట్టుకున్న సామాగ్రి విలువను లెక్కించి రైల్వే శాఖ ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లించాలి.

మనం ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో హ్యాపీగా రైలులో ప్రయాణిస్తుంటాం. అలాంటి సమయంలో దొంగలు చేతివాటం చూపిస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా చూసుకునే మన లగేజీను దొంగలిస్తుంటారు. అయితే ఆ బ్యాగులో విలువైన సామగ్రి ఉంటే మన కంగారు పతాకస్థాయికు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో మనం పోయిన లగేజీ గురించి ఎవరిని సంప్రదించాలి. కొంచెం తెలిసిన వారైతే తర్వాత రైలులో ఉండే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు సమాచారం ఇస్తారు. అనంతరం తదుపరి స్టేషన్ లో రైల్వే ప్రొటెక్షన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. మనం రెగ్యులర్ వారిని కలిసినా ఇంకా దొరకలేదనే సమాధానమే ఎదురవుతుంది. అయితే మీకు ఒక విషయం తెలుసా? మనం పోయిన లగేజీకు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్ట ప్రకారం పొగొట్టుకున్న సామాగ్రి విలువను లెక్కించి రైల్వే శాఖ ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లించాలి.
నష్ట పరిహారాన్ని క్లెయిమ్ చేయడం ఎలా?
భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రయాణికుడు కదులుతున్న రైళ్లలో సామాను దొంగతనం, దోపిడీ జరిగినప్పుడు రైల్వే కండక్టర్‌లు, కోచ్ అటెండెంట్‌లు, గార్డ్‌లు లేదా జీఆర్పీ ఎస్కార్ట్‌లను సంప్రదించి, ఫిర్యాదు చేయాలి. తర్వాత మీకు ఎఫ్ఐఆర్ ఫారమ్‌లు ఇస్తారు. వాటిని జాగ్రత్తగా పూర్తి చేసి వారికి ఇవ్వాలి. ఒక నేరాన్ని పోలీసులకు నివేదించడానికి, ప్రయాణికుడు వారి ప్రయాణాన్ని నిలిపేయాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు చేయడానికి, ప్రయాణీకుడు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఉన్న ఆర్పీఎఫ్ సహాయ పోస్టులను కూడా సందర్శించవచ్చు.
రైళ్లలో బ్యాగేజీపై పరిమితి
అయితే రైల్వే శాఖ ఇచ్చే పరిహారం కిలో రూ.100 మాత్రమే ఉంటుందని గమనించాలి. కానీ బుకింగ్ సమయంలో క్లెయిమ్ చేయబడిన మొత్తం సామగ్రి పేర్కొన్న విలువ కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాగే లగేజీ విలువను ముందుగానే ప్రకటించి రుసుము చెల్లిస్తే క్లెయిమ్ చేసిన మొత్తాన్ని పొందవచ్చు. సరుకు. ప్యాసింజర్ లగేజీ రిజర్వేషన్ కార్యాలయంలో పర్సంటేజ్ ఫీజు ఎలా చెల్లించాలనే దాని గురించి తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ లో వివరాలు
రైల్వే శాఖ ఆపరేషన్ అమానత్ కింద, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రయాణికులు తమ తప్పిపోయిన బ్యాగ్‌లను సులభంగా కనుగొనడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. సంబంధిత రైల్వే జోన్‌ల వెబ్‌సైట్‌లో సంబంధిత విభాగాలకు చెందిన ఆర్పీఎఫ్ సిబ్బంది పోయిన లగేజీ వివరాలు ఫోటోలను పోస్ట్ చేస్తారు. ప్రయాణికులు తమ లగేజీని వెబ్‌సైట్‌లో కనుగొనడం ద్వారా స్టేషన్ నుంచి తీసుకోవచ్చు. ప్రయాణీకులు తమ లగేజీ తప్పిపోయినా లేదా రైలు మార్గంలో లేదా రైళ్లలో పోయినా, స్టేషన్‌లలో ఉన్న లాస్ట్ ప్రాపర్టీ ఆఫీస్ సెంటర్‌లలో ఇప్పటికీ అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు.
లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



