Lifestyle: వ్యాయామంతో శారీరక ఆరోగ్యం ఒక్కటే కాదు.. పరిశోధనల్లో కీలక విషయాలు..

ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్న వృద్ధుల్లో వచ్చే జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యను చెక్‌ పెట్టడంలో వ్యాయామం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారంలో కనీసం ఒక్కసారైనా చమట పట్టేలా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు...

Lifestyle: వ్యాయామంతో శారీరక ఆరోగ్యం ఒక్కటే కాదు.. పరిశోధనల్లో కీలక విషయాలు..
Workouts
Follow us

|

Updated on: Jul 15, 2024 | 7:42 PM

వ్యాయామం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే కచ్చితంగా రోజులో కొంత సమయమైనా వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. అయితే వ్యాయామంతో కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం సైతం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్న వృద్ధుల్లో వచ్చే జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యను చెక్‌ పెట్టడంలో వ్యాయామం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారంలో కనీసం ఒక్కసారైనా చమట పట్టేలా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండెతో పాటు శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామం చేయడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. 75 ఏళ్ల లోపు వారిలోనే ఇలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మంచి నిద్రకు కూడా వ్యాయామం ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు చేసినా రాత్రిపూట మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో వ్యాయామం ఉపయోగపడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.

సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు? వీరిలో నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి? రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు? పగటిపూట ఎంతవరకు మగతగా ఉంటున్నారు? లాంటి విషయాలను గమనించి ఈ నిర్ధారణకు వచ్చారు. వారానికి కనీసం రెండుసార్లు వ్యాయామం చేసే వారికి నిద్రలేమి ముప్పు 42 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటితో పాటు వీరిలో నిద్రలేమి లక్షణాలు 22 నుంచి 40 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..