పారిజాతం మొక్కలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా…? ఇంటికి అదృష్టంతో పాటు..

|

Jun 08, 2023 | 11:03 AM

ఈ పారిజాత మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని చెబుతారు. పారిజాత చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన పారిజాత మొక్క, పూలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. అందుకే ఎక్కువగా పారిజాత మొక్క ను ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది.

పారిజాతం మొక్కలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...? ఇంటికి అదృష్టంతో పాటు..
Parijat Flower
Follow us on

ఇంటిల్లిపాది ఆనందం, శ్రేయస్సు కోసం, వాస్తు శాస్త్రంలో కొన్ని చెట్లు-మొక్కల నివారణలకు సంబంధించి ప్రస్తావించబడింది. వాటిలో ఒకటి పారిజాత పుష్పం. పారిజాత పువ్వును పారిజాతం అని కూడా అంటారు. ఇంగ్లీషులో నైట్ జాస్మిన్ అంటారు. పారిజాతలు చెట్టు నుంచి కింద రాలినప్పుడు మాత్రమే పూజకు ఉపయోగిస్తారు. ఈ పారిజాత మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని చెబుతారు. దాన్ని దేవతలకు అందించగా, ఇంద్రుడు దానిని స్వర్గంలోని తన తోటలో నాటాడు అని చెబుతారు. శ్రీ మహా విష్ణువు, లక్ష్మిదేవిని ఈ పూలతో పూజిస్తే వారి ఆశ్వీరాదం లభిస్తుంది. పారిజాత చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన పారిజాత మొక్క, పూలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పారిజాత పుష్పాలు తెల్లగా నాలుగు రేకులతో ఉండి మధ్యలో నారింజ పండు కలర్‌లో ఉంటాయి. ఈ చెట్టు పుష్ఫాలు రాత్రి పూట వికసించగా తెల్లవారితే రాలిపోతుంటాయి. ఈ చెట్టు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది. మత్తును తెప్పిస్తాయి. అయితే, దీని ఆకులకు, పుష్ఫాలకు ఎంతో విశిష్ణ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. అలాగే గొంతు వాపును తగ్గిస్తుంది. అనేక వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. గొంతు కండరాలు మృదువుగా ఉంచుతుంది. పారిజాత మొక్క జ్వరాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి సహయపడుతుంది. మలేరియా జ్వరం తో బాధ పడుతున్న వాళ్ళు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వల్ల మలేరియా జ్వరం తగ్గిపోతుంది. అంతేకాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి పారిజాతం నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మెదడులోని సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా ను పెరగకుండా చేస్తుంది. దీనివల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలు రాకుండా పారిజాతం మొక్క బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలను పోగొడుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. పారిజాత ఆకులను కషాయంగా చేసుకొని తాగడం వల్ల కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి. అందుకే ఎక్కువగా పారిజాత మొక్క ను ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది. పారిజాత పువ్వులను కాషాయం గా తీసుకొని తాగడం వల్ల షుగర్‌ వ్యాధి నివారణ అవుతుంది. పారిజాత విత్తనాలను కాషాయం గా చేసుకొని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా, తలలో ఉండే పేల్లు కూడా నశిస్తాయి.

ఈ పారిజాత మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని చెబుతారు. పారిజాత చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన పారిజాత మొక్క, పూలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ సంబంధిత వార్తల కోసం…