Facial Hair: ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..

|

Sep 27, 2024 | 2:22 PM

ప్రస్తుత కాలంలో అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. దురద, చికాకు, పిగ్మంటేషన్, నల్ల మచ్చలు, పింపుల్స్, పొడి బారి పోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు చాలా మందికి ముఖంపై వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. బుగ్గలు, నుదిటిపై, పెదాలపై వెంట్రుకలు వస్తూ ఉంటాయి. దీని వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది. చూడటానికి మగవారిలా కనిపిస్తారు. ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలు తొలగించినా మళ్లీ..

Facial Hair: ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..
Facial Hair
Follow us on

ప్రస్తుత కాలంలో అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. దురద, చికాకు, పిగ్మంటేషన్, నల్ల మచ్చలు, పింపుల్స్, పొడి బారి పోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు చాలా మందికి ముఖంపై వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. బుగ్గలు, నుదిటిపై, పెదాలపై వెంట్రుకలు వస్తూ ఉంటాయి. దీని వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది. చూడటానికి మగవారిలా కనిపిస్తారు. ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలు తొలగించినా మళ్లీ వచ్చేస్తూ ఉంటాయి. ఇందుకోసం ఎన్నెన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అలాగే వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల చర్మం దెబ్బ తింటుంది. హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవడం వల్లే ఆడవారిలో ఈ మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని హోమ్ రెమిడీస్‌ పాటిస్తే ముఖంపై ఉండే హెయిర్‌ను తొలగించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు – బొప్పాయి ఫేస్ మాస్క్:

ముఖంపై ఉండే అన్ వాంటెడ్ హెయిర్‌ని తొలగించడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. అందాన్ని పెంచడంలో కూడా పసుపు దివ్య ఔషధంలా పని చేస్తుంది. అందుకే ముఖంపై ఉండే వెంట్రుకలను పోగొట్టడానికి పసుపు ఫేస్ మాస్క్‌లను తొలగించుకోవచ్చు.

బొప్పాయితో కలిపి పసుపు ఫేస్ మాస్క్ వేసుకోడం వల్ల వెంట్రుకలు పోయి.. ముఖ అందం కూడా పెరుగుతుంది. బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు కూడా కలిపి ముఖం అంతా రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా రాత్రంతా వదిలేసి ఉదయం ఫేస్ శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

శనగ పిండి – పసుపు:

ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడంలో శనగ పిండి, పసుపు ఫేస్ ప్యాక్ కూడా హెల్ప్ చేస్తుంది. వారంలో రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ శనగ పిండిలో చిటికెడు పసుపు కలిపి, కొద్దిగా తేనె కలిపి ముఖం అంతా రాసుకోవాలి. ఇది ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ ఫేస్ ప్యాక్‌లో పెరుగు కూడా కలిపి రాసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..