అమ్మాయిలు రాత్రి పూట ఎందుకు జుట్టు దువ్వకూడదో తెలుసా?
ఇంట్లో పెద్దలు చెప్పే నీతి సూత్రాల వెనుక ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఇలాంటి అతి ముఖ్యమైన నియమాలలో ఒకటి మహిళల జుట్టు సంరక్షణ. జుట్టు దువ్వడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉందట. పురాతన కాలం నుంచి అమ్మమ్మలు, నానమ్మలు రాత్రిపూట జుట్టు దువ్వడం, జుట్టు జడ వేయకుండా వదులుగా వదిలేయకూడదని చెబుతున్నారు.

మన సంస్కృతి, సంప్రదాయాల్లో జీవన విధానానికి సంబంధించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ఏ సమయంలో ఏది చేయాలి? ఎలాంటి మార్గంలో జీవించాలి వంటి విషయాలు మన పూర్వికులు పేర్కొన్నారు. వీటినే ఆచారాలు, సంప్రదాయాలు అనే ముసుగులో నేటికీ పాటిస్తున్నారు. వీటి వెనుక ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి మరి. ఇలాంటి అతి ముఖ్యమైన నియమాలలో ఒకటి మహిళల జుట్టు సంరక్షణ. జుట్టు దువ్వడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉందట. పురాతన కాలం నుంచి అమ్మమ్మలు, నానమ్మలు రాత్రిపూట జుట్టు దువ్వడం, జుట్టు జడ వేయకుండా వదులుగా వదిలేయకూడదని చెబుతున్నారు. ఇలా చెప్పడం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం అంటే పగలు, రాత్రి కలిసే సమయం. ఈ సమయం తర్వాత వాతావరణంలో ప్రతికూల శక్తి, దుష్ట శక్తులు సక్రియం అవుతాయని నమ్ముతారు. రాత్రిపూట వదులుగా ఉన్న జుట్టు వదిలేసినా, చింపిరి జుట్టు ప్రతికూల శక్తులను తనవైపుకు ఆకర్షిస్తుందట. దీని కారణంగా మహిళలు మానసిక క్షోభ అనుభవించవచ్చు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఇలాంటి సమయాల్లో జడ వేయకుండా జుట్టు వదిలేయడం వల్ల మీ ఇంటిని మురికిగా భావించి, పేదరికానికి ఆహ్వానిస్తుందని నమ్మకం. దేవాలయాన్ని సందర్శించేటప్పుడు ఎల్లప్పుడూ జుట్టు జడ వేసుకునే వెళ్లాలి. ఎందుకంటే వదులుగా ఉన్న జుట్టు పరధ్యానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
జుట్టు స్త్రీ అందానికి ఆభరణం. కానీ దానిని వదులుగా ఉంచడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాతన నమ్మకాల ప్రకారం దుఃఖ సమయాల్లో మాత్రమే జుట్టు వదులుగా ఉంటుంది. కాబట్టి సంతోషకరమైన జీవితం, ఇంటి శ్రేయస్సు కోసం మహిళలు జడ వేసుకోవాలి. చాలా మంది అమ్మాయిలకు రాత్రిపూట జుట్టు వదిలేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తప్పు. రాత్రిపూట జుట్టు వదులుగా ఉంచి నిద్రపోవడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పురోగతిపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. జుట్టు దువ్వేటప్పుడు ఊడిన జుట్టును పారవేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఊడిన జుట్టును వీధిలో లేదా జనాలు తిరిగే ప్రదేశంలో వేయకూడదు. కొంతమంది దానిని ప్రతికూల ప్రయోజనాల కోసం, మంత్రవిద్యల కోసం ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి, ఊడిని జుట్టును సురక్షితమైన స్థలంలో మాత్రమే పారవేయాలి.
పౌర్ణమి రాత్రి వాతావరణం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి జుట్టు దువ్వకూడదు. ఈ సమయంలో తల స్నానం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది శరీర సహజ చక్రం, వేడిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. జుట్టు దువ్వుతున్నప్పుడు దువ్వెన పదే పదే చేతిలోంచి పడిపోతే, అది భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకు, చెడు వార్తలకు సంకేతంగా పరిగణించబడుతుంది. అలాంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఈ నియమాలను పాటించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మీ ఇంట్లో సానుకూల శక్తిని కాపాడుకోవడం, మహిళలకు మంచి ఆరోగ్యం, మనశ్శాంతిని అందించడానికి మాత్రమే.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకాలకు సంబంధించినవి. వీటిని టీవీ9 నిర్ధారించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




