Ice Cream: ఐస్ క్రీం తిన్న తర్వాత దాహం వేస్తుందా.. నీరు తాగడం వలన కలిగే ప్రమాదం ఏమిటో తెలుసా..

|

May 19, 2023 | 7:57 AM

ఐస్ క్రీం శరీరాన్ని చల్లగా ఉంచుతుందని.. దీన్ని తినడం వల్ల వేడిలో ఉపశమనం లభిస్తుందని కొందరు నమ్ముతారు. సరే కొంత వరకు ఇది కూడా సరైనదే. అయితే ఐస్ క్రీం తిన్న తర్వాత చాలా మంది దాహం వేస్తుంది అనే ఫీల్ ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా.

Ice Cream: ఐస్ క్రీం తిన్న తర్వాత దాహం వేస్తుందా.. నీరు తాగడం వలన కలిగే ప్రమాదం ఏమిటో తెలుసా..
Ice Cream
Follow us on

ఐస్‌క్రీమ్‌ సీజన్ తో వయసు తో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. ఉపశమనం కోసం ఐస్ క్రీం తినడానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తారు. ఈ సీజన్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్‌క్రీమ్‌ అంటే చాలా ఇష్టపడతారు. ఐస్ క్రీం శరీరాన్ని చల్లగా ఉంచుతుందని.. దీన్ని తినడం వల్ల వేడిలో ఉపశమనం లభిస్తుందని కొందరు నమ్ముతారు. సరే కొంత వరకు ఇది కూడా సరైనదే. అయితే ఐస్ క్రీం తిన్న తర్వాత చాలా మంది దాహం వేస్తుంది అనే ఫీల్ ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా.

ఐస్ క్రీం తిన్న తర్వాత దాహం వేయడానికి కారణమేమిటని మీరు గమనించారా? ఇలా మీకు మాత్రమే జరుగుతుందని భావిస్తూ ఉంటారు.. అయితే ఇలా అందరికీ జరుగుతుంది. అయినప్పటికీ ఐస్ క్రీమ్ తిన్న తరువాత దాహం వేసినా నీరు తాగకూడదు. ఐస్ క్రీం తిన్న తర్వాత ఎందుకు దాహం వేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

ఐస్ క్రీం తిన్నాక దాహం ఎందుకు వేస్తుందంటే
ఐస్ క్రీం లేదా స్వీట్లు తిన్న తర్వాత దాహం వేయడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఒక పరిశోధన ప్రకారం ఐస్ క్రీంలో చక్కెర.. సోడియం రెండూ ఉంటాయి. ఐస్ క్రీం తిన్నప్పుడు.. తర్వాత మీ రక్తంలో సోడియం, చక్కెర రెండూ కలుస్తాయి. చక్కెర మన రక్తంలోకి ప్రవేశించిన తర్వాత అది శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభమవుతుంది. దీని తరువాత అది మన శరీరంలోని కణాల నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మన మెదడు ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటుంది. మెదడులోని చిన్న భాగానికి సంకేతాలను పంపడం ప్రారంభిస్తుంది. దీనిని హైపోథాలమస్ అంటారు. నిజానికి, ఈ సందేశమే మన శరీరానికి నీరు అవసరమని భావించేలా చేస్తుంది. అందుకే దాహం వేస్తుంది.

వెంటనే నీరు త్రాగాలా?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొందరు ఐస్ క్రీమ్ తిన్న వెంటనే దాహం అనిపించి నీళ్లు తాగుతుంటారు. అయితే మీరు కూడా ఇలా చేస్తుంటే ఆ తప్పును సరిదిద్దుకోండి. వెంటనే నీరు త్రాగడం వల్ల గొంతు నొప్పి , దంత సమస్యలు వస్తాయి. అందుకే ఐస్‌క్రీం తిన్న 15 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..