రోజు రోజుకీ మారుతున్న జీవనశైలితో ప్రజలు తమ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం ప్రారంభించారు. ఈ రోజుల్లో కొందరు వ్యాయామానికి జిమ్‌కి వెళితే, మరికొంత మంది ఇంట్లో యోగా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే వ్యాయామశాలలో పని చేస్తున్నప్పుడు.. అనేక రకాల పరికరాలు అవసరమవుతాయి. అయితే యోగా చేయాలనుకుంటే మాత్రం కేవలం యోగా మ్యాట్ మాత్రమే అవసరం. యోగా చేసే వారు కచ్చితంగా మ్యాట్‌లను ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మార్కెట్‌లో మీకు అనేక రకాల యోగా మ్యాట్‌లు దొరుకుతున్నాయి. ఇవి యోగా కోసం ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి రూపొందించబడ్డాయి. ఇతర మాట్‌ల కంటే యోగా మ్యాట్ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో యోగా మ్యాట్ ఉపయోగించడం అవసరమా అని చాలా మంది ఎప్పుడూ గందరగోళానికి గురవుతారు. నేలపై కూర్చుని యోగా చేయవచ్చా? అలాగే చాపను కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? అన్న విషయాలన్నింటి గురించి గందరగోళంగా ఉంటే.. నిపుణులు చెప్పిన విషయాల గురించి తెలుకుందాం..
యోగాకు యోగా మ్యాట్ అవసరమా?
యోగా చేసేవారు మ్యాట్‌ను ఉపయోగించడం చాలా అవసరమని నిపుణులు సుగంధ గోయల్ చెప్పారు. ఎందుకంటే ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే యోగా మ్యాట్ లేకుండా యోగా చేస్తే గాయాలు అవుతాయని భయపడతారు. అలాగే యోగా మ్యాట్ ని ఉపయోగంతో వ్యాయామం సులభం అవుతుంది. ముఖ్యంగా వృద్ధులు నేలపై యోగా చేస్తే ఆసనాలు వేయడానికి ఇబ్బంది పడతారు. అందువల్ల.. సరైన యోగా మ్యాట్‌ను ఉపయోగించి యోగాసనాలు వేయాలి.
ఎలాంటి యోగా మ్యాట్ కొనాలంటే
యోగా మ్యాట్ ఎవరికైనా యోగా చేయడం సులభం చేస్తుంది. యోగా మ్యాట్ ను కొనుగోలు చేసే విషయంలో కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే యోగా మ్యాట్ శరీరానికి సౌలభ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల.. మ్యాట్ కొనుగోలు చేసే విధయంలో కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. చాప మందం 1.5 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే బ్రైట్ కలర్స్ ఉండరాదు. అదే విధంగా యోగా మ్యాట్ ఎక్కువ మెత్తగా ఉండకూడదు. మంచి పట్టు ఉన్న యోగా మ్యాట్‌ని కొనుగోలు చేయాలి.
ప్రతిరోజూ యోగా మ్యాట్‌ని ఉపయోగిస్తుంటే.. శుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రబ్బరు మ్యాట్‌లు త్వరగా వాసన రావడం ప్రారంభిస్తాయి. మ్యాట్ మురికిగా ఉంటే దానిపై ఉండే బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. యోగా చేసిన తర్వాత.. చాపను మడతపెట్టి, ఎండలో ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల యోగా మ్యాట్ దెబ్బతింటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..