AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి ఈ విషయాలు తెలియదు..

మహిళల చేతి గాజుల గలగల శబ్దంలో ఏదో తెలియని ఒక అందం, ఆనందం దాగి ఉంటాయి. మన సంప్రదాయంలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో.. పెళ్లయిన మహిళలకు గాజులు ధరించడం కూడా అంతే ముఖ్యం. అయితే గాజులు కేవలం పెళ్లికి గుర్తో లేక చేతుల అందాన్ని పెంచే ఆభరణమో మాత్రమే కాదు.. వాటి వెనుక మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి.

మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి ఈ విషయాలు తెలియదు..
Surprising Health Benefits Of Wearing Bangles
Krishna S
|

Updated on: Jun 01, 2026 | 9:16 AM

Share

భారతీయ సంస్కృతిలో మహిళల ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మన సంప్రదాయంలో పెళ్లయిన మహిళలు తప్పకుండా చేతులకు గాజులు ధరించాలని పెద్దలు చెబుతుంటారు. సింధూరం, మంగళసూత్రం లాగే గాజులు కూడా ముత్తైదువుల వైవాహిక బంధానికి, అదృష్టానికి ప్రతీకగా నిలుస్తాయి. గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని, వాటి నుండి వచ్చే గలగల శబ్దాలు ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల శక్తిని తీసుకువస్తాయని మత విశ్వాసాలు బలంగా నమ్ముతాయి. అయితే గాజులు ధరించడం వెనుక కేవలం మతపరమైన నమ్మకాలు, అందం మాత్రమే కాకుండా.. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే అనేక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి.

చేతులకు గాజులు ధరించడం వల్ల కలిగే ప్రధాన శారీరక ప్రయోజనాల్లో రక్త ప్రసరణ మెరుగుపడటం ఒకటి. మహిళలు రోజంతా పనులు చేసేటప్పుడు గాజులు మణికట్టు చర్మానికి నిరంతరం రాపిడి కలిగిస్తాయి. ఈ ఘర్షణ కారణంగా చేతుల్లో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అలాగే బంగారం, వెండి లేదా సాధారణ గాజుతో చేసిన వస్తువులను ధరించడం వల్ల శరీరంలో ఒక రకమైన సానుకూల శక్తి ఉత్పత్తి అవుతుంది. గాజుల వల్ల కలిగే ఈ నిరంతర రాపిడి శరీరంలో అలసటను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది.

పురుషులతో పోలిస్తే స్త్రీల శరీర తత్వాలు, హార్మోన్ల స్థాయిలు చాలా సున్నితంగా ఉంటూ, తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. శాస్త్రీయ ఆధారాల ప్రకారం, మణికట్టు భాగంలో ఉండే కొన్ని ప్రెజర్ పాయింట్స్‌పై గాజుల ఒత్తిడి పడటం వల్ల మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఇది వారి మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, మనస్సులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా నిరోధించడానికి ఎంతో సహాయపడుతుంది.

ఇక మానసిక, భావోద్వేగ పరంగా చూస్తే, గాజుల నుండి వచ్చే మధురమైన గలగల శబ్దాలు మహిళల మెదడుకు సానుకూల ప్రకంపనలను అందిస్తాయి. ఈ శబ్దం వారి ఏకాగ్రతను పెంచడంతో పాటు పరిసరాల్లోని ప్రతికూల శక్తిని తొలగించి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నిరంతరం గాజులు ధరించే మహిళలు ఒత్తిడికి లోనవ్వకుండా, ఇతరుల కంటే తమ ఎమోషన్స్‌ను చాలా మెరుగ్గా నియంత్రించుకోగలరని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే మన పూర్వీకులు పెట్టిన గాజుల సంప్రదాయం కేవలం అలంకారం కోసమే కాదు అది మహిళల సర్వతోముఖ ఆరోగ్యానికి ఒక శ్రీరామరక్ష అని చెప్పవచ్చు.

Follow Us