AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ చెక్-ఇన్, చెక్​-అవుట్ టైమింగ్స్​ మ.12-2 గం. మధ్య ఎందుకు?

మీరు ఎప్పుడైనా హోటల్​లో రూమ్​ బుక్ చేసినప్పుడు గమనించారా? దాదాపు అన్ని హోటల్స్‌లో చెక్-ఇన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలకు లేదా 2 గంటలకు, చెక్-అవుట్ ఉదయం 11 గంటలు లేదా మధ్యాహ్నం 12 గంటలలోపు మాత్రమే ఉంటుంది. ఎందుకు అన్ని హోటళ్లలో ఈ టైమింగ్స్​ని ..

హోటల్ చెక్-ఇన్, చెక్​-అవుట్ టైమింగ్స్​ మ.12-2 గం. మధ్య ఎందుకు?
Hotel
Nikhil
|

Updated on: Nov 26, 2025 | 7:55 PM

Share

మీరు ఎప్పుడైనా హోటల్​లో రూమ్​ బుక్ చేసినప్పుడు గమనించారా? దాదాపు అన్ని హోటల్స్‌లో చెక్-ఇన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలకు లేదా 2 గంటలకు, చెక్-అవుట్ ఉదయం 11 గంటలు లేదా మధ్యాహ్నం 12 గంటలలోపు మాత్రమే ఉంటుంది. ఎందుకు అన్ని హోటళ్లలో ఈ టైమింగ్స్​ని ఫాలో అవుతారు? ఉదయం 8 గంటలకే రూమ్ ఇవ్వరా? రాత్రి 8 గంటల వరకు ఉండలేమా? ఈ ప్రశ్నలు చాలామంది మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి. నిజానికి దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర, బిజినెస్ లాజిక్​ ఉన్నాయి!

గ్లోబల్ స్టాండర్డ్..

19వ శతాబ్దంలో యూరప్, అమెరికాలోని గ్రాండ్ హోటల్స్ రైళ్ల షెడ్యూల్‌ను బట్టి టైమింగ్స్ ఫిక్స్ చేశాయి. ఆ రోజుల్లో రైళ్లు ఉదయం 10-11 గంటలకు చేరేవి. ప్రయాణికులు చెక్-అవుట్ చేసి వెళ్లిపోతే, రూమ్ శుభ్రం చేసి మధ్యాహ్నం 2 గంటలకు కొత్త గెస్ట్‌కు రెడీ చేయడం సులువు. ఈ ట్రెడిషన్ ఇప్పటివరకు కొనసాగుతోంది. భారత్‌లో కూడా బ్రిటిష్ కాలం నాటి రైల్వే హోటల్స్ నుంచి ఈ నియమం వచ్చింది.

శుభ్రత & సేఫ్టీ

ఒక గెస్ట్ ఉదయం 11 గంటలకి వెళ్లిపోతే, హౌస్‌కీపింగ్ టీమ్‌కు కనీసం 2-3 గంటలు దొరుకుతాయి. మంచం మార్చడం, బాత్‌రూమ్ సానిటైజ్ చేయడం, కార్పెట్ వాక్యూమ్, పెస్ట్ కంట్రోల్… ఇవన్నీ సరిగ్గా చేయాలంటే టైమ్ కావాలి. మధ్యాహ్నం 12 గంటల కంటే ముందు చెక్-ఇన్ ఇస్తే, వెళ్లిపోయిన గెస్ట్ వదిలిన జుట్టు, దుమ్ము, బ్యాక్టీరియా కొత్త గెస్ట్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. ఇది హోటల్ రేటింగ్‌ను పడగొడుతుంది.

బిజినెస్ లాజిక్

హోటల్ రూమ్ అంటే 24 గంటల పీరియడ్​ టైమ్​ ఉంటుంది. ఉదయం 10 గంటలకే చెక్-ఇన్ ఇస్తే, ఆ రోజు రూమ్ ఆక్యుపెన్సీ 38 గంటలు అవుతుంది. కానీ ఛార్జీ మాత్రం ఒక్క రోజుదే! హోటల్‌కు నష్టం. అందుకే మధ్యాహ్నం 12/2 చెక్-ఇన్ ఫిక్స్ చేసి, 24 గంటలకు ఒక రూమ్ రెవెన్యూ గ్యారంటీ చేసుకుంటారు.

కావాలంటే మార్చుకోవచ్చు..

ఎర్లీ చెక్-ఇన్ లేదా లేట్ చెక్-అవుట్ కావాలంటే… ఎక్స్‌ట్రా ఛార్జీ కడితే సరిపోతుంది. కొన్ని హోటల్స్ ‘24-అవర్ స్టే’ ప్యాకేజీలు పెట్టాయి. ఎప్పుడు వచ్చినా 24 గంటలు ఉండొచ్చు, కానీ వీటికి రేటు కొంచెం ఎక్కువ! ఇప్పుడు అర్థమైందా.. హోటల్స్​లో చెక్-ఇన్, చెక్​-అవుట్ టైమింగ్స్​ ఎందుకు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యనే ఉంటాయో!