AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025: ఈ ఏడాది పెళ్లి బంధంతో కొత్త జీవితం మొదలుపెట్టిన సెలబ్రిటీలు!

2025 సంవత్సరం కేవలం రికార్డుల విజయాన్ని మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోని ఎంతో మంది ప్రముఖులకు జీవితంలో ఒక మధుర ఘట్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు పలుకుతూ, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొందరు తమ ..

2025: ఈ ఏడాది పెళ్లి బంధంతో కొత్త జీవితం మొదలుపెట్టిన సెలబ్రిటీలు!
Akhil Marriage
Nikhil
|

Updated on: Dec 13, 2025 | 9:05 PM

Share

2025 సంవత్సరం కేవలం రికార్డుల విజయాన్ని మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోని ఎంతో మంది ప్రముఖులకు జీవితంలో ఒక మధుర ఘట్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు పలుకుతూ, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొందరు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోగా, మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గ్లామర్, సంప్రదాయం, అనూహ్య సర్‌ప్రైజ్‌లు కలగలిపిన ఈ సెలబ్రిటీ వెడ్డింగ్స్ 2025ను ప్రత్యేకంగా నిలిపాయి. టాలీవుడ్ వారసుడి నుంచి స్టార్ హీరోయిన్ వరకు… ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన ప్రముఖ సెలబ్రిటీలెవరో చూద్దాం..

అఖిల్ అక్కినేని – జైనబ్

అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. గతేడాది అన్న నాగచైతన్య పెళ్లి జరగగా, ఈ ఏడాది తమ్ముడు అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్-జైనబ్ వివాహం జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అక్కినేని కుటుంబంలో ఆనంద ఘట్టంగా నిలిచింది.

సమంత – రాజ్ నిడిమోరు

ఈ ఏడాది అత్యంత అనూహ్యమైన, సంచలనాత్మక పెళ్లిగా హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, డిసెంబర్ 1న తమిళనాడులోని ఈషా యోగా సెంటర్‌లో భూతశుద్ధి పద్దతిలో పెళ్లి చేసుకుని అందరికీ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.

అవికా గోర్ – మిలింద్ చంద్వానీ

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది. ఐదేళ్ల సుదీర్ఘ ప్రేమ తర్వాత, జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. అవికా తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ వంటి హిట్ సినిమాలతో మెప్పించింది.

హీనా ఖాన్ – రాకీ జైస్వాల్

బుల్లితెర నటి హీనా ఖాన్, టెలివిజన్ నిర్మాత రాకీ జైస్వాల్ దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత 2025 జూన్ 4న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్ సెట్స్‌లో మొదలైంది. ముఖ్యంగా, హీనా ఖాన్‌కు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన సమయంలో రాకీ ఆమెకు అండగా నిలిచి తన ప్రేమను నిరూపించారు.

అర్మాన్ మాలిక్ – ఆష్నా ష్రాఫ్

ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆష్నా ష్రాఫ్ తమ ప్రేమ బంధానికి వివాహంతో ముగింపు పలికారు. ఈ జంట 2025 జనవరి 2న మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. అర్మాన్ మాలిక్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పాటలు పాడి కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు.

వీరితో పాటు కన్నడ నటి అర్చన కొట్టిగె, హిందీ టీవీ జంట ఆశ్లేష సావంత్ – సందీప్ బస్వానా, యువ దర్శకుడు అభిషన్ జీవింత్ కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. 2025 సినీ ప్రపంచానికి మధురమైన దాంపత్య బంధాలను బహుమతిగా ఇచ్చింది.