ప్రతి రోజూ రాత్రి దంపతులు ఇలా చేస్తే.. దాంపత్య జీవితం మస్తు మధురంగా ఉంటుంది..!
వివాహితులు రాత్రి నిద్రకు ముందు కొన్ని సరళమైన పనులు చేస్తే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. దంపతులు కలసి పడుకోవడం వల్ల ప్రేమ, సన్నిహితత, పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు దాంపత్య జీవితాన్ని మధురంగా, శ్రేయస్సుతో నింపుతాయి.

దంపతుల మధ్య ప్రేమ ఉండాలి. అప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు. అలాంటి వారు పిల్లలను కూడా ఆదరణతో పెంచుతారు. తల్లితండ్రులు ఎప్పుడూ గొడవ పడితే పిల్లలు భయంతో పెరుగుతారు. మానసికంగా గందరగోళానికి లోనవుతారు. రాత్రి పడుకునే ముందు దంపతులు ఒకరికొకరు దగ్గరగా ఉండటం బంధానికి చాలా మంచిది. దూరంగా పడుకోవడం వల్ల బంధం బలహీనపడవచ్చు. ప్రతిరోజూ కలిసి పడుకోవడం, మాట్లాడుకోవడం, దగ్గరగా ఉండటం మీ అనుబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
పడుకునే ముందు భాగస్వామిని కౌగిలించుకోవడం బంధానికి బలం ఇస్తుంది. అలాంటి సాన్నిహిత్యం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా దగ్గరగా ఉండటం వల్ల బంధం సంతోషంగా కొనసాగుతుంది.
రోజువారీ జీవనశైలి వల్ల చాలా మందికి కోపం, ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు కౌగిలించుకుని పడుకోవడం మంచి ప్రభావం చూపుతుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రేమను పెంచే హార్మోన్. మనసును తేలికపరచుతుంది. సంబంధం తీపిగా మారుతుంది.
కౌగిలించుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అవగాహన మెరుగవుతుంది. ఆ హార్మోన్ వల్ల వచ్చే వెచ్చదనం బంధాన్ని మెరుగుపరుస్తుంది. రాత్రి నిద్ర నాణ్యంగా మారుతుంది. ఉదయాన్నే సంతోషంగా లేచే అవకాశం ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు కాసేపు మాట్లాడుకోవడం వల్ల బంధం బలపడుతుంది. మీ అనుభూతులను ఒకరికొకరు పంచుకోవడంతో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది. ఇలా ప్రవర్తించే వారు సంతోషంగా ఉంటారు.
కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండె నెమ్మదిగా పని చేస్తుంది. ఇది పరోక్షంగా బంధానికి మేలు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటే సంబంధం కూడా సజావుగా సాగుతుంది.