AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Nuts: జాడిపప్పు ధర ఎందుకు అందనంత ఎత్తులో ఉంటుందో తెలుసా?

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు అన్ని వయసుల వారు జీడిపప్పు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి రుచికి భలేగా ఉంటాయి. వీటితో పలు రుచికరమైన వంటకాలు కూడా తయారు చేస్తారు. జీడిపప్పు కొంచెం ఖరీదైన డ్రై ఫ్రూట్స్. 1 కిలో జీడిపప్పు ధర రూ.వెయ్యి కంటే ఎక్కువగానే ఉంటుంది. జీడిపప్పును పండించడం నుంచి..

Cashew Nuts: జాడిపప్పు ధర ఎందుకు అందనంత ఎత్తులో ఉంటుందో తెలుసా?
Cashew Nuts
Srilakshmi C
|

Updated on: Nov 28, 2025 | 8:27 PM

Share

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు అన్ని వయసుల వారు జీడిపప్పు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి రుచికి భలేగా ఉంటాయి. వీటితో పలు రుచికరమైన వంటకాలు కూడా తయారు చేస్తారు. జీడిపప్పు కొంచెం ఖరీదైన డ్రై ఫ్రూట్స్. 1 కిలో జీడిపప్పు ధర రూ.వెయ్యి కంటే ఎక్కువగానే ఉంటుంది. జీడిపప్పును పండించడం నుంచి మార్కెట్‌కు తీసుకురావడం వరకు ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. జీడిపప్పు సాగు చాలా సవాలుతో కూడుకున్నది. అందుకే జీడిపప్పుకు మార్కెట్లో ఖరీదు ఎక్కువ. పైగా జీడిపప్పు చెట్లు ఫలాలను ఇవ్వడానికి చాలా ఏళ్లు పడతాయి. అలాగే, జీడిపప్పు చెట్లు ఉష్ణమండల వాతావరణంలో మాత్రమే అధిక దిగుబడిని ఇస్తాయి. దీనికి తేమ, వేడి, సకాలంలో వర్షపాతం అవసరం. వాతావరణంలో చిన్న మార్పులు కూడా పంటను ప్రభావితం చేస్తాయి. అలాగే జీడిపప్పు పండులో ఒకే ఒక విత్తనం ఉంటుంది. దీని అధిక ధరకు ఇది కూడా ఒక కారణమే.

జీడి పంట అంత సులువుకాదు

ఇక పంట తర్వాత, జీడిపప్పును శుభ్రపరచడం, ఎండబెట్టడం, వేయించడం, ప్యాకేజింగ్ చేయడం వంటి అనేక ప్రాసెసింగ్ దశలు ఉంటాయి. జీడిపప్పు పెంకు గట్టిగా ఉండటమే కాకుండా విషపూరితమైనది కూడా. జీడిపప్పు పెంకులో CNSL అనే కాస్టిక్ ఆయిల్ ఉంటుంది. దీన్ని తాకితే చర్మాన్ని కాల్చేస్తుంది. అందువల్ల, జీడిపప్పు పరిశ్రమలో ఉన్నవారు, కార్మికులు దానిని ప్రాసెస్ చేయడంలో చాలా కష్టపడుతుంటారు. అలాగే దీని ప్రాసెసింగ్ ఖర్చు కూడా ఖరీదైనది. కోత, విత్తనాలు తీయడం, పొట్టు తీయడం నుంచి ప్యాకేజింగ్ వరకు జీడిపప్పును తయారు చేయడంలో అనేక దశలు ఉంటాయి. మొత్తం ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అందువల్ల, నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్ ఉంటుంది.

అధిక డిమాండ్, తక్కువ ఉత్పత్తి

ప్రపంచవ్యాప్తంగా జీడిపప్పుకు భారీ డిమాండ్ ఉంది. పండుగలలో, స్వీట్లు తయారు చేయడానికి, వంట కోసం జీడిపప్పును విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ దేశీయ జీడిపప్పు ఉత్పత్తి.. డిమాండ్ ఉన్నంత వేగంగా పెరగడం లేదు. ఈ డిమాండ్-సరఫరా అంతరమే ధర పెరుగుదలకు కారణం. అధిక డిమాండ్,పరిమిత సరఫరా కారణంగా డిపప్పు చాలా ఖరీదైనదిగాగా ఎంచబడుతుంది. గ్రేడ్ జీడిపప్పును పెద్ద మొత్తంలో విదేశాలకు సైతం రవాణా చేస్తారు.

ఇవి కూడా చదవండి

గ్రేడింగ్

జీడిపప్పును ఒలిచి వేయించిన తర్వాత వాటిని పరిమాణం, నాణ్యత, ఆకారం ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియకు చాలా నైపుణ్యం కలిగిన శ్రమ అవసరం. ఇందులో పగలని జీడిపప్పులు చాలా ఖరీదైనవి. పగిలిన జీడిపప్పు ధర కొంచెం తక్కువగా ఉంటుంది.

నిల్వ, రవాణా ఖర్చులు

గాలి చొరబడని ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్, సురక్షిత రవాణా కూడా గణనీయమైన ఖర్చులను కలిగి ఉంటాయి. ఈ అంశం చివరికి జీడిపప్పు ధరను ప్రభావితం చేస్తుంది. అనేక దేశాల నుంచి ముడి జీడిపప్పును మన దేశం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఆఫ్రికన్ దేశాలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ ధరలలో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులు, కంటైనర్ ఛార్జీలు, లాజిస్టిక్స్ అన్నీ జీడిపప్పు ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us