AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banned Foods: ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్ యమలోకానికి పార్శిలే

కొన్ని ఆహారాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, అవి ప్రాణాలకు ప్రమాదకరం. ఆరోగ్య సమస్యలు, భద్రతా కారణాలు, పర్యావరణ పరిరక్షణ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొన్ని ఆహార పదార్థాలను నిషేధించాయి. కిండర్ సర్ప్రైజ్ నుండి ప్రాణాంతకమైన ఫుగు వరకు, ఏ ఆహారాలు ఎందుకు నిషేధించబడ్డాయో, వాటి వెనుక ఉన్న ప్రమాదాలు ఏంటో తెలుసుకుందాం.

Banned Foods: ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్ యమలోకానికి పార్శిలే
Banned Foods Worldwide
Anand T
|

Updated on: Mar 27, 2026 | 3:28 PM

Share

కొన్ని ఆహారాలు చూడ్డాన్ని ఆకర్షనీయంగా ఉన్నప్పటికీ వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఇవి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అయితే ఒక్కప్పుడూ ఇలానే మార్కెట్‌లో సర్వసాధారణంగా లభించే కొన్ని ఆహార పదార్థాలను చాలా దేశాలు నిషేదించాయి. ఆయా దేశాల్లో ఇప్పుడు వాటి వాడకం పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేదించబడిన ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం పదండి.

ప్రపంచవ్యాప్తంగా నిషేదించిన ఆహార పదార్థాలు ఇవే

కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్: భారతదేశంలో పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ చాక్లెట్ ఎగ్స్‌ను అమెరికాలో చాలా కాలం నిషేధించారు. ఈ చాక్లెట్ లోపల చిన్న ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి. వీటిని తిన్నప్పుడు పిల్లల గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉందని భావించి యూఎస్ ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది.

పచ్చి పాలు : పచ్చి పాలలో ‘సాల్మొనెల్లా’, ‘ఇ.కోలి’ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల అనారోగ్యం కలుగుతుందని చాలా దేశాల్లో పచ్చి పాలను నేరుగా విక్రయించడాన్ని నిషేధించారు. అలాగే మనం నిత్యం వంటల్లో వాడే గసగసాలను కొన్ని దేశాల్లో నిషేధించారు. ఎందుకంటే వీటిని మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారనే ఉద్దేశంతో కొన్ని దేశాలు వీటిని అనుమతించడం లేదు.

ఫుగు: ఇది పఫర్ ఫిష్‌తో తయారు చేసే ఒక జపనీస్ వంటకం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చేపలలో ఒకటి. ఇందులో ఉండే విషం వల్ల పక్షవాతం లేదా మరణం సంభవించే అవకాశం ఉంది. అందుకే దీనిపై నిషేధం ఉంది, కేవలం లైసెన్స్ ఉన్న నిపుణులైన చెఫ్లు మాత్రమే జపాన్‌లో దీనిని తయారు చేయడానికి అనుమతి ఉంటుంది.

షార్క్ ఫిన్ సూప్: దీన్ని షార్క్ చేపల రెక్కలతో తయారు చేస్తారు. దీని కోసం విచ్చలవిడిగా చేపల వేట సాగడం వల్ల షార్క్ చేపల సంఖ్య తగ్గిపోతోంది. అందుకే అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడటానికి షార్క్ ఫిన్ సూప్‌ను నిషేధించారు.

హ్యాగిస్ : ఇది స్కాట్లాండ్‌కు చెందిన సాంప్రదాయ వంటకం. గొర్రె ఊపిరితిత్తులను ఉపయోగించి ఈ వంటకాన్ని ప్రిపేర్ చేస్తారు. అమెరికా ఆహార భద్రతా నియమాల ప్రకారం వీటిని ఆహారంగా వాడకూడదు, అందుకే అక్కడ దీనిని నిషేధించారు.

దురియన్: ఇది ఒక రకమైన పండు, ఇది చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీనిని తినడం చట్టవిరుద్ధం కాదు కానీ, దీని వాసన భరించలేక ఆసియాలోని చాలా దేశాల్లో హోటళ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి బహిరంగ ప్రదేశాల్లో దీనిని నిషేధించారు.

కాసు మార్జు: ఇది ఇటలీకి చెందిన ఒక రకమైన చీజ్. ఇందులో పురుగుల లార్వాలు ఉంటాయి. దీనిని ఒక రుచికరమైన పదార్ధంగా భావిస్తారు, కానీ ఆరోగ్య, పరిశుభ్రత కారణాల దృష్ట్యా యూరోపియన్ యూనియన్ దీనిని నిషేధించింది.

(Note: పైన పేర్కొన్న ఈ సమాచారం ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడింది. వీటిని TV9 దృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?
తెలుగురాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్..రాబోయే 3రోజుల పాటు వర్షాలు
తెలుగురాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్..రాబోయే 3రోజుల పాటు వర్షాలు
పుచ్చకాయ గింజలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
పుచ్చకాయ గింజలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే.. ఇవి కూరలో వేస్తే చాలు
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే.. ఇవి కూరలో వేస్తే చాలు
ప్రియదర్శి ‘సుయోధన’ సినిమా రివ్యూ..
ప్రియదర్శి ‘సుయోధన’ సినిమా రివ్యూ..
తెలంగాణ రైతులకు శుభవార్త.. ఇక నుంచి అన్నీ ఒకేచోట
తెలంగాణ రైతులకు శుభవార్త.. ఇక నుంచి అన్నీ ఒకేచోట