హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ సమస్యలు కొనసాగుతున్న వేళ నార్సింగి పరిధిలో పట్టపగలే చోరీ ఘటన కలకలం రేపింది. అల్కాపూర్ టౌన్షిప్ట్ సమీపంలో గ్యాస్ డెలివరీ ఆటో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.