AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suyodhana Movie Review: ప్రియదర్శి ‘సుయోధన’ సినిమా రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టాడా..?

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి. 'బలగం' లాంటి ఎమోషనల్ హిట్‌తో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేసిన దర్శి.. ఇప్పుడు రూటు మార్చి 'సుయోధన' అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చాడు. సాయి కుమార్, ప్రేమ లాంటి సీనియర్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ శ్రీరామ నవమి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేర థ్రిల్ చేసిందో రివ్యూలో చూద్దాం..

Suyodhana Movie Review: ప్రియదర్శి ‘సుయోధన’ సినిమా రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టాడా..?
Suyodhana Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 27, 2026 | 2:50 PM

Share

మూవీ రివ్యూ: సుయోధన

నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్, సాయి కుమార్, ప్రేమ, సత్యదేవ్, బిత్తిరి సత్తి, తదితరులు

సంగీతం: జై క్రిష్

నిర్మాత: బోసుబాబు నిడుమోలు

దర్శకత్వం: వై.ఎస్. మాధవ్ రెడ్డి

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి. ‘బలగం’ లాంటి ఎమోషనల్ హిట్‌తో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేసిన దర్శి.. ఇప్పుడు రూటు మార్చి ‘సుయోధన’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చాడు. సాయి కుమార్, ప్రేమ లాంటి సీనియర్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ శ్రీరామ నవమి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేర థ్రిల్ చేసిందో రివ్యూలో చూద్దాం..

కథ:

వరుణ్ (ప్రియదర్శి) వృత్తిరీత్యా ఓ ఫోలీ అంటే సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే ఆర్టిస్ట్ అన్నమాట. అతనికి చిన్నప్పటి నుంచి పదే పదే ‘సుయోధన’ అనే శబ్దం వినిపిస్తూ, కళ్ల ముందు దుర్యోధనుడి రూపం కనిపిస్తూ భయపెడుతుంటుంది. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) ఒక రంగస్థల నటుడు. ఆయనకు నాటకాల్లో దుర్యోధనుడి వేషం వేయడం అంటే ప్రాణం. అయితే తన కొడుకు ఆ రూపం చూసి భయపడుతున్నాడని డాక్టర్లు చెప్పడంతో నాటకాలకు స్వస్తి పలుకుతాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉంటాడు ప్రకాష్. ఈ గ్యాప్‌లో వరుణ్‌కు ఓ డెమో ఫిల్మ్ షూట్ కోసం వచ్చిన సమిత (ద్రిషిక చందర్) పరిచయం అవుతుంది. ఇదిలా ఉంటే.. తనకు ఎప్పుడైనా ప్రాణహాని పొంచివున్నప్పుడే ఆ దుర్యోధనుడి రూపం కనిపిస్తుందని వరుణ్ రియలైజ్ అవుతాడు. సరిగ్గా అదే టైమ్‌లో సొంత తండ్రిలోనే అతనికి దుర్యోధనుడు కనిపిస్తాడు. ఆ వెంటనే జరిగిన ఓ దాడిలో తండ్రి చనిపోతాడు. అసలు వరుణ్ తండ్రిని ఎవరు చంపారు? ఈ మర్డర్ వెనుక ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటి? వరుణ్‌ను వెంటాడే ‘సుయోధన’ మిస్టరీ ఏంటి? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

కథనం:

సైకలాజికల్ థ్రిల్లర్స్ మనకు కొత్తేం కాదు కానీ.. ఫోలీ ఆర్టిస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రావడం మాత్రం తెలుగు ఆడియన్స్‌కు ఒక ఫ్రెష్ ట్రీట్‌మెంట్. అసలు సినిమాల్లో మనం వినే సౌండ్స్ ఎలా రికార్డ్ చేస్తారో ఈ సినిమా ద్వారా చాలా ఆసక్తికరంగా చూపించారు. డైరెక్టర్ మాధవ్ రెడ్డిది ఇది మొదటి సినిమానే అయినా.. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కడా తడబడకుండా, సగటు ప్రేక్షకుడిలో ‘వాట్ నెక్స్ట్?’ అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేశాడు. ఈ సినిమాకు ‘సౌండ్’ అనేది ప్రాణం అని చెప్పాలి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్‌కు.. జై క్రిష్ మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా చిన్నపాటి ల్యాగ్స్ ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్‌గా నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ఇంకాస్త క్రిస్ప్‌గా రాసుకుంటే బాగుండేది. సైకలాజికల్ థ్రిల్లర్‌కు పొలిటికల్ డ్రామాను, మదర్ సెంటిమెంట్‌ను బాగానే బ్లెండ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

నటీనటులు:

ప్రియదర్శి తన మార్క్ కామెడీకే పరిమితం కాకుండా.. ఇలాంటి ఇంటెన్స్ రోల్‌లో కూడా ఒదిగిపోయాడు. తన కెరీర్‌లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ధుర్యోధనుడి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసేశారు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌తో సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. హీరో తల్లిగా సీనియర్ నటి ప్రేమ బాగా చేశారు. హీరోయిన్ ద్రిషిక తన పాత్ర పరిధి మేర ఆకట్టుకుంది. ఇక సత్యదేవ్, బిత్తిరి సత్తి క్యామియో రోల్స్ కథలో ఇమిడిపోయాయి. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ క్యారెక్టర్స్‌కు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. సౌండ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్స్ హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.

టెక్నికల్ టీం:

సౌండ్ డిజైనింగ్ నేపథ్యంలోనే వచ్చింది ఈ చిత్రం.. దీనికి జై క్రిష్ అందించిన సంగీతం బాగానే ఉంది. పాటలు ఎక్కకపోయినా ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ కాస్త ఇంకాస్త షార్ప్‌గా ఉండుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు మాధవ్ రెడ్డి కొత్త కథను చెప్పే ప్రయత్నం చేసాడు.. అందులో బాగానే సక్సెస్ అయ్యాడు కూడా.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సుయోధన.. డిఫరెంట్ సౌండ్ డిజైనింగ్ మిస్టరీ థ్రిల్లర్‌

Follow Us