AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రైతులకు తీపికబురు.. అన్నీ సేవలు ఒకే చోట.. ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్

తెలంగాణ ప్రభుత్వ రైతుల కోసం మరో కొత్త పోర్టల్ తీసుకొచ్చింది. అదే ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్. గతంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక భూభారతి పోర్టల్ ధరణి స్థానంలో తీసుకొచ్చింది. ఇప్పుడు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఫ్లాట్‌ఫామ్ లాంచే చేసింది.

Telangana: తెలంగాణ రైతులకు తీపికబురు.. అన్నీ సేవలు ఒకే చోట.. ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్
Telangana Farmers
Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 2:47 PM

Share

తెలంగాణ ప్రభుత్వం రైతులకు సూపర్ న్యూస్ అందించింది. రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు సేవలన్నింటినీ ఒకేచోటకు తీసుకచ్చేందుకు ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. రైతులకు సులభతరంగా సేవలు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ కొత్తగా ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 5 మండలాల్లో ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్, సర్వే, స్టాంప్ సేవలన్నీ ఒకేచోట ఈ పోర్టల్‌లో లభిస్తాయి. దీని వల్ల రైతుల భూసమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయి. ధరణి పోర్టల్ స్థానంలో తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌లోని భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఈ పోర్టల్ తీసుకొచ్చింది.

ఏప్రిల్ 2 నుంచి అమలు

ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ తీసుకురానుంది. ఈ విషయాన్ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 5 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అమన్ గల్, సంగారెడ్డి జిల్లాలోని వట్ పల్లి, ఖమ్మం జిల్లా నుంచి కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. రైతులకు అన్నీ సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చినట్లు వివరించారు. భూసమస్యల పరిష్కారానికి, భూ లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ధరణిలోని అక్రమాలకు చెక్ పెట్టేందుకు భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని, ఇప్పుడు రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రెవెన్యూ లాంటి అన్నీ సేవలు ఒకే ఫ్లాట్‌ఫామ్ ద్వారా సులువుగా అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పోర్టల్ తెచ్చినట్లు పేర్కొన్నారు.

భూదార్ నెంబర్లు

ఆధార్ కార్డు తరహాలోనే ప్రతీ సర్వే నెంబ్ నెంబర్‌కు ప్రత్యేకంగా గుర్తింపు కల్పించేందకు భూదార్ నెంబర్లను కేటాయిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భూముల రీ సర్వే చేపడతామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ జత చేస్తామన్నారు. 5 మండలాల్లో అమలు చేసిన తర్వాత అందులో వచ్చే సమస్యలను గమనించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రైతులకు సలుభంగా సేవలు అందించడంతో పాటు భూవివాదాలకు పరిష్కారం చూపేందుకు ఈ కొత్త ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించినట్లు వివరించారు. కాగా సచివాలయంలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, స్టాంపుల అధికారులతో పొంగులేటి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూభారతి పోర్టల్, ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌పై చర్చించారు.

Follow Us