Almonds: బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!

|

Dec 14, 2024 | 4:42 PM

ప్రతిరోజూ బాదం పప్పు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు..

Almonds: బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
Almonds
Follow us on

శరీరం ఆరోగ్యంగా బలంగా, దృఢంగా ఉండాలంటే.. అనేక విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావాలి. ఇవన్నీ మనకు డ్రై డ్రై నట్స్‌‌లో లభిస్తాయి. డ్రై నట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలిసిందే. కానీ డ్రై నట్స్‌లో అత్యంత ఉత్తమమైనది.. రుచిగా ఉండేది బాదం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ తగిన మోతాదులో బాదం తింటే శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బాదంలో అనేక పోషకాలు లభిస్తాయి. ప్రతి రోజూ బాదం పప్పులు తింటే బాడీ ఫిట్‌గా ఉంటుందని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతూ ఉంటారు. ఆరోగ్యం బాలేనప్పుడు తప్పించి పెద్దగా వీటి జోలికి ఎవరూ వెళ్లరు. బాదంలో హెల్దీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే బాదం పప్పును లిమిట్‌గానే తీసుకోవాలి. మంచిది కదా అని అతిగా తిన్నా.. ఆరోగ్యానికి ప్రమాదమే. మరి బాదం పప్పును రోజుకు ఎన్ని తీసుకుంటే మంచిదో.. ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ని తినవచ్చు:

బాదం పప్పులు లెక్క పెట్టుకుని తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ప్రతి రోజూ 7 లేదా 8 పప్పులను నానబెట్టుకుని ఒక మనిషి తినవచ్చు. మరీ ఎక్కువగా అయితే 10కి మించి తినకూడదు. 7 లేదా 8 బాదం పప్పులో 6 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల హెల్దీ ఫ్యాట్నస్, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, అంతే కాకుండా ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా లభిస్తుంది. కాబట్టి చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. ఇలా లిమిట్‌గా తింటేనే ఆరోగ్యానికి మంచిది. 7, 8 పప్పులు కూడా తినలేని వాళ్లు 4 లేదా 2 రెండూ తినవచ్చు.

అతిగా తింటే అనారోగ్య సమస్యలు తప్పువు.

ఏదన్నా సరే మంచిది కదా అని అతిగా తింటే మాత్రమ అది విషంగా మారుతుంది. ఇదే పద్దతి బాదం పప్పులకు కూడా వర్తిస్తుంది. ప్రతి రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అంతే కాకుండా బరువు పెరుగుతారు, కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచిది.

ఇవి కూడా చదవండి

ఏ సమయంలో తీసుకోవాలి:

బాదం పప్పులను సాధ్యమైనంత వరకు ఉదయం తినడమే మంచిది. అప్పుడు కుదరని వారు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా స్నాక్స్‌లా తినొచ్చు. అంతే కానీ రాత్రి పూట మాత్రం తినకూడదు. బాదం నానబెట్టి తింటేనే పోషకాలు పుష్కలంగా అందుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..