AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: జీలకర్ర Vs వాము.. ఆరోగ్యానికి ఏది మంచిది..? పోషకాలు ఎలా ఉంటాయి..?

జీలకర్ర - వాము అనేవి శతాబ్దాలుగా భారతీయ ఇళ్లలో ఉపయోగిస్తున్న సుగంధ ద్రవ్యాలు. ఈ రెండూ ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. చూడడానికి అవి ఒకేలా కనిపిస్తాయి. మరి రెండింటి పోషక విలువలు ఏంటీ..? అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయనేది తెలుసుకుందాం.

Health Tips: జీలకర్ర Vs వాము.. ఆరోగ్యానికి ఏది మంచిది..? పోషకాలు ఎలా ఉంటాయి..?
Cumin Vs Ajwain
Krishna S
|

Updated on: Jul 25, 2025 | 9:43 PM

Share

భారతీయ వంటగది ఎన్నో సుగంధ ద్రవ్యాల నిలయం. అవి ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర, వాము తప్పక ఉంటాయి. ఇవి ఒకేలా కనిపిస్తాయి. అయితే వాటి ప్రయోజనాలు, పోషకాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఒకటి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. మరోటి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఒకటి ఐరన్ యొక్క అద్భుతమైన మూలం. మరోదానిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యం అవసరాలకు మీరు ఏది ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒకేలా కనిపించే జీలకర్ర – వాములో ఏ ఏ పోషకాలు ఉన్నాయి..? అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీలకర్రలో పోషకాలు..

జీలకర్ర- వామ.. రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ రెండింటి పోషకాలలో పెద్ద తేడా ఉంది. ఉదాహరణకు, జీలకర్ర గురించి మాట్లాడుకుంటే.. దానిలో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను అధిగమించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం ఉంటాయి.

వాములో పోషకాలు

వాము ప్రోటీన్, ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇది బరువు తగ్గడానికి, కడుపు సమస్యలను తగ్గించడానికి ప్రభావవంతంగా ఉంటుంది. థైమోల్ అనే మూలకం కూడా ఇందులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు వాములో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.

జీలకర్ర యొక్క ప్రయోజనాలు..

జీలకర్ర రక్త లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా సహాయపడుతుంది. అదే సమయంలో, జీలకర్ర కడుపు సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని వినియోగం గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఇది బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

వాము ప్రయోజనాలు

థైమోల్ అనే మూలకం వాములో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. దీనితో పాటు, ఇది కడుపు ఇన్ఫెక్షన్‌ను నివారించి.. ఆకలిని పెంచుతుంది. వాము నీరు బరువు తగ్గడం, జలుబు, దగ్గు, రుతుక్రమ నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

రెండిటిలో ఏది బెస్ట్..?

జీలకర్ర, వాము.. రెండూ వాటి స్వంత పోషక విలువలు, విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని మీరు మీ అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. మీకు ఐరన్ లోపం ఉంటే, జీలకర్ర తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో మీరు గ్యాస్, బరువు తగ్గడం, జలుబు నుండి ఉపశమనం పొందాలనుకుంటే వాము మంచి ఆప్షన్. వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి, రుతుక్రమ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..