వాల్‌నట్స్ గురించి తెలియని వారుండరు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసే సూపర్ ఫుడ్. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా నెల రోజులపాటు సరైన పరిమాణంలో వీటిని తీసుకుంటే మీ కళ్లను మీరే నమ్మలేనంత మార్పు గమనిస్తారు. ప్రతిరోజూ వాల్‌నట్‌లను తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం, మెదడు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఆరోగ్యంపై అనేక గొప్ప ప్రభావాలను చూపుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వంటి వృద్ధాప్యంతో సంభవించే మానసిక సమస్యలను నివారిస్తుంది. వాల్‌నట్స్‌లో మంచి మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని కారణంగా, ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, వాల్‌నట్స్‌లో జింక్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని ముడతల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది.
అయితే వాల్‌నట్స్ సరైన పరిమాణంలో తిన్నప్పుడే మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ 5-7 వాల్‌నట్‌లను మాత్రమే తినాలి. ఇవి పూర్తి పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాల్‌నట్‌లను ఎక్కువగా తినడం వల్ల అధిక కేలరీలు అందుతాయి. దీంతో బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి సరైన పరిమాణంలో మాత్రమే వీటిని తీసుకోవాలి.