Salt: బాబోయ్‌.. నెల రోజులు పూర్తిగా ఉప్పు తినడం మానేస్తే అంత డేంజరా?

|

Sep 24, 2024 | 8:40 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అధిక శ్రద్ధ అవసరం. బరువు తగ్గడానికి, మెరుగైన ఆరోగ్యానికి ఉప్పు తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే నెల రోజుల పాటు ఉప్పును పూర్తిగా తీసుకోవడం మానేస్తే..

Salt: బాబోయ్‌.. నెల రోజులు పూర్తిగా ఉప్పు తినడం మానేస్తే అంత డేంజరా?
Salt Benefits
Follow us on

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అధిక శ్రద్ధ అవసరం. బరువు తగ్గడానికి, మెరుగైన ఆరోగ్యానికి ఉప్పు తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే నెల రోజుల పాటు ఉప్పును పూర్తిగా తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?

మీరు ఒక నెల పాటు ఉప్పు తినకుండా ఉంటే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అది ఉపవాసం కావచ్చు, ఆరోగ్య ప్రణాళికలో భాగం కావచ్చు.. కొన్ని సందర్భాల్లో ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం సర్వసాధారణం. అయితే ఇలా పూర్తిగా ఉప్పు మానేస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ ఉప్పు పూర్తిగా నిషేధిస్తే మాత్రం డేంజర్‌ అంటున్నారు నిపుణులు. నిజానికి ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. తగినంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని తీసుకోవడం మానేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఉప్పు తీసుకోకపోతే, కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ఛాన్స్‌ ఉందంటున్నారు నిపుణులు. అదే 30 రోజులు ఉప్పు తినకపోతే ఏమవుతుంది?

ఆకస్మిక బరువు తగ్గడం

ఉప్పు తీసుకోకపోతే క్రమంగా బరువు తగ్గుతారు. 30 రోజులు ఉప్పు తినకపోతే శరీరం తక్కువ తినడానికి అలవాటు పడుతుంది. ఇది మీ పొట్ట, నడుము కొవ్వును తగ్గిస్తుంది. కానీ ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియలో ఇబ్బంది

మీరు ఒక నెల పాటు ఉప్పు తీసుకోకపోతే, అది మీ శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఇది ప్రేగులను ప్రభావితం చేస్తుంది. కడుపు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

మానసిక ఆరోగ్య సమస్య

మీ శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం పరంగా కూడా డేంజరే. అందుకే ఉప్పు తినడం పూర్తిగా మానేయకూడదు. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి వల్ల బీపీ తగ్గడంతో పాటు ఆందోళనకు దారితీస్తుంది. అందుకే శరీరానికి పరిమితమైన మోతాదులో ఉప్పు తీసుకోవడం చాలా అవసరం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.