అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ నిజం తెలిస్తే అసలు తాగరు

కొంతమంది అన్నం తినడానికి ముందు చాలా నీళ్లు తాగుతారు. మరికొందరు అన్నం తింటూ నీళ్లు తాగుతారు. అయితే, ఇలా అన్నం తింటూ నీళ్లు తాగడం నిజంగా మంచిదేనా..? వైద్యులు ఏమంటున్నారు? నిజానికి, భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేస్తున్నప్పుడు నీరు త్రాగడం వల్ల కొన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ నిజం తెలిస్తే అసలు తాగరు
Eating Food

Updated on: Sep 06, 2025 | 11:53 AM

భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా తాగడం వల్ల కొంతమందిలో గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు వస్తాయని వారు అంటున్నారు. కొంతమందికి అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. నీళ్లు తాగాలనుకునేవారు అన్నం తినే ముందు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలోని రసాలు పలుచన అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ ఈ అలవాట కారణంగా శరీరంలో బలహీనత, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. తిన్న వెంటనే, లేదంటే భోజనం చేస్తూ నీరు తాగడం వల్ల కడుపులో ఉండే ఆహారం, గాలి మధ్య ఉండే మిశ్రమం పలుచన అవుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

ఇలా ఆహారంతో పాటు నీళ్లు తీసుకోవడం వల్ల కడుపులో అపానవాయువు, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే భోజనం చేసేటప్పుడు నీరు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తరువాత 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి. అలాగే, ఆహారం తినేందుకు అరగంట ముందు నీళ్లు తాగాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us