ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందించడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పోషకాలతో కూడిన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, శరీరంలో ఏదైనా ఒక విటమిన్ లోపం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పోషకాలలో విటమిన్ కె కూడా ఒకటి. దీని లోపం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అనేక విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఈ పోషకం లోపాన్ని గుర్తించి వెంటనే పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.
విటమిన్ కె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకలు, గుండె మరియు మెదడు సజావుగా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. శరీరంలో ఈ పోషకం లోపం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో విటమిన్ K లోపాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఇక్కడ తెలుసుకుందాం..
1. చిన్న చిన్ని గాయాలకే ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. తరచూ ముక్కు నుండి రక్తస్రావం కూడా విటమిన్ Kలోపం వల్ల ఏర్పడుతుంది. ఎముకల సాంద్రత తగ్గడం, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది. కీళ్లు, ఎముకలలో అడపాదడపా నొప్పికి కారణం కూడా విటమిన్ కె లోపంగా చెబుతారు. చిన్న గాయం అతి త్వరగా పెద్ద గాయంగా మారుతుంది. అలాంటి గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది. దంతాలు, చిగుళ్ళలో రక్తస్రావం కావటం కూడా విటమిన్ కె లక్షణంగా చెబుతున్నారు. ఇంకా విటమిన్ కె లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు…
– క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)
– ఆస్తమా
– అలర్జిక్ బ్రోన్కైటిస్
– శ్వాసకోశ సామర్థ్యం తగ్గిపోవటం.
అయితే, ఇటీవల వెల్లడైన పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇందులో విటమిన్ కే లోపించినవారిలో ఊపిరితిత్తుల సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ పనితీరు తగ్గిపోవటం వంటి ఏదో ఒక రకమైన ఊపిరితిత్తుల వ్యాధి ఎటాక్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అంటే విటమిన్ కే అనేది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా అవసరం అని పరిశోధనలో తేలింది. అంతేకాదు..విటమిన్ K గుండె వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. అందుకే విటమిన్ K లోపాన్ని అధిగమించాలంటే మీరు తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి..
ముఖ్యంగా ఆకు కూరలు, ఆవాలు, పాలకూర, గోధుమ, బార్లీ, ముల్లంగి, బీట్‌రూట, అరటిపండు, మొలకెత్తిన ధాన్యాలు, జ్యుసి ఫ్రూట్, గుడ్లు, మాంసం, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, సోయాబీన్ వంటి వాటిలో అధిక మొత్తంలో ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..